హైదరాబద్ : తెలంగాణలో పెద్ద ఎత్తున కలకలం రేపుతోంది మంత్రి కోమటిరెడ్డి వ్యవహారం. నల్లగొండ జిల్లాలో ఓ ఐఏఎస్ కలెక్టర్ తో తాను ప్రేమాయణం నడుపుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరగడం, ఎన్టీవీ ఛానల్ తో పాటు ఇతర ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ లలో తనను లక్ష్యంగా చేసుకుని డ్యామేజ్ చేయడం పట్ల తీవ్రంగా స్పందించారు. శనివారం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను సంచలన ఆరోపణలు కూడా చేశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. తాను పూర్తిగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మొన్న నిన్న ఈరోజు ఛానల్స్..సోషల్ మీడియాలో మహిళా అధికారులమీద నల్గొండ మంత్రులు అంటూ ఏవేవో కథనాలు వేస్తున్నారంటూ వాపోయారు.
కలెక్టర్లు, ఐఏఎస్ అధికారుల బదిలీలు మార్పులు అన్ని ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ చేతుల్లో ఉంటుందన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నల్గొండ సహా ఏ జిల్లాలో మార్పులు చేయాలన్నా ముఖ్యమంత్రి నిర్ణయాన్ని బట్టి ఉంటుందని స్పష్టం చేశారు. ఇలా చిల్లర మల్లరగా ప్రచారం చేయడం మంచి పద్దతి కాదన్నారు . వీరి వ్యవహారంలో మంత్రుల ప్రమేయం ఉండదన్నారు. తప్పుడు వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ముఖ్యమంత్రి పైన కూడా ఇంతకంటే ఘోరమైన వీడియోలు గతంలో చేశారంటూ తెలిపారు.















