Rashmika Mandanna : హైదరాబాద్ : నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మరోసారి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జీ తెలుగులో పాపులర్ షో కొనసాగుతోంది ప్రముఖ నటుడు జగపతిబాబు సారథ్యంలో. ఆయన పలువురు నటీ నటులను సరదాగా, హ్యాపీగా ఇంటర్యూ చేస్తున్నారు. ఈ సందర్బంగా అందాల ముద్గుగుమ్మ రష్మిక మందన్నా (Rashmika Mandanna) కూడా తన జాబితాలో చేరి పోయింది. ఆయన పలు ప్రశ్నలు సంధించారు. ప్రత్యేకమైన డ్రెస్ తో పాటు చేతి వేళ్లకు ఉన్న ఉంగరాల గురించి గుచ్చి గుచ్చి అడిగారు నటుడు జగపతి బాబు. దీనికి తెలివిగా సమాధానం ఇచ్చింది. రష్మమిక మందన్నా నిశ్చితార్థం గురించి మాట్లాడకుండానే చెప్పేసింది మౌనంగా. తాను ధరించిన ఉంగరాలలో ఒక ఉంగరం మాత్రం వెరీ వెరీ స్పెషల్ అని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆ రింగ్ కు ఉన్న ప్రత్యేకత ఏమిటో చెప్పాలని అడిగాడు జగ్గూ భాయ్.
Rashmika Mandanna Comments
అమ్మో అంటూనే అది వెరీ స్పెషల్ అంటూ చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. రష్మిక మందన్నా ఉంగరాలు ఎవరివై ఉంటాయని నెటిజన్లు తెగ వెతుకుతున్నారు. అయితే ఆ ఉంగరానికి వేరే కథ ఉందంటూ చెప్పింది. ఇటీవలే ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండతో తను ఎంగేజ్మమెంట్ చేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. ఈ ఇద్దరూ చెట్టా పట్టాల్ వేసుకుని తిరుగుతున్నారు. ఈ ఇద్దరూ కలిసి డియర్ కామ్రేడ్, గీత గోవిందం సినిమాలో నటించారు. వచ్చే ఏడాది 2026లో పెళ్లి చేసుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
Also Read : Singer Chinmayi Fired on Jani Master : జానీ మాస్టర్, కార్తీక్ లపై చిన్మయి శ్రీపాద ఫైర్
