Gold : దేశీయంగా బంగారం ధరలు ఎప్పటికీ లేనంతగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1.05 లక్షలు దాటగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.96 వేలకుపైగా చేరుకుంది. దీంతో సాధారణ ప్రజలకు బంగారం కొనుగోలు దాదాపు భారంగా మారింది.
Gold – ఆభరణాల తయారీలో ఉపయోగించే క్యారెట్లు
22 క్యారెట్లు (916): బంగారు (Gold) ఆభరణాలకు ప్రధానంగా ఉపయోగించే ఈ బంగారంలో సుమారు 91.6% మేలిమి బంగారం ఉంటుంది. బంగారం సహజంగా మెత్తగా ఉండటంతో దానిలో రాగి సహా ఇతర లోహాలను కలిపి దృఢంగా చేసి నగల తయారీలో ఉపయోగిస్తారు.
18 క్యారెట్లు: ఇందులో 75% బంగారం, 25% ఇతర లోహాలు ఉంటాయి. కఠినతరం గల ఈ బంగారం విగ్రహాలు, వాచీలు, బరువైన ఆభరణాల తయారీలో వాడతారు. ధర 10 గ్రాములకు సుమారు రూ.75 వేల వరకు ఉంటుంది.
14 క్యారెట్లు: ఇందులో 58.3% మేలిమి బంగారం ఉంటుంది. తక్కువ ధర కారణంగా దీనిని కూడా ఆభరణాల తయారీలో ఎక్కువగా వినియోగిస్తారు.
9 క్యారెట్ల బంగారం – కొత్త అవకాశాలు
ఇటీవల కేంద్ర ప్రభుత్వం 9 క్యారెట్ల బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్ అనుమతిని ఇచ్చింది. ఇందులో కేవలం 37.5% మేలిమి బంగారం, మిగతా 62.5% ఇతర లోహాలు ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో 9K బంగారం ధర 10 గ్రాములకు సుమారు రూ.36,660గా ఉంది. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉంటాయి.
ఆభరణాల పరిశ్రమ ప్రతిస్పందన
ఇప్పటివరకు BIS 24K, 23K, 22K, 20K, 18K, 14K బంగారాలకు మాత్రమే హాల్‌మార్కింగ్ నిబంధనలు కల్పించింది. తాజాగా 9K బంగారానికి అనుమతి లభించడం ఆభరణాల పరిశ్రమలో సానుకూలతను తెచ్చింది. ధరలు అధికంగా ఉండటంతో జూన్‌లో బంగారం అమ్మకాలు దాదాపు 60% తగ్గాయి. ఇది కోవిడ్-19 తర్వాత అత్యంత తీవ్ర పతనంగా గుర్తించబడింది.
ధర వ్యత్యాసం – 9K vs 24K
- 24K బంగారం (10 గ్రాములు): సుమారు రూ.1,05,000
- 9K బంగారం (10 గ్రాములు): సుమారు రూ.36,660
తక్కువ ధరలో లభించే 9K బంగారం, రాబోయే దసరా, దీపావళి, వివాహ సీజన్ వంటి సమయాల్లో వినియోగదారుల ఆకర్షణగా మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read : Today Gold Price : చూస్తుండగానే పరుగులు పెడుతున్న పసిడి ధరలు



















