తమిళ సినీ రంగానికి చెందిన దమ్మున్న డైరెక్టర్ పా రంజిత్ తీసిన తంగలాన్ మూవీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తను గతంలో రజనీకాంత్ తో కాలా తీశాడు. మనోడికి సామాజిక నేపథ్యం ఉన్న అంశాలు అంటే అభిమానం. ప్రత్యేకించి ప్రజల వాయిస్ ను సినిమా వినిపించాలని కోరుకునే వ్యక్తి. ప్రత్యేకంగా ఏకంగా భారీ ఎత్తున పుస్తకాలతో లైబ్రరీ ఏర్పాటు చేశాడు.
కర్ణాటక కోలార్ లో జరిగిన యధార్థ కథను తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. అదే విక్రమ్ , మాళవిక మోహన్ తో తీసిన తంగళాన్. ఎలాంటి డైలాగులు లేకుండానే కేవలం బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు జీవీ ప్రకాష్.
ఇక విక్రమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అపరిచితుడులో తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఒక్కో సినిమాకు తను ఏమిటో, తన సత్తా ఏమిటో చెప్పకనే చెబుతూ వచ్చాడు. అతడిలోని నటుడిని ప్రత్యేకంగా ప్రదర్శించేలా చేశాడు దర్శకుడు పా రంజిత్.
తంగలాన్ సినిమాకు సంబంధించి విడుదల చేసిన టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో రాసిన డైలాగ్ , కొటేషన్ ఇప్పుడు వైరల్ గా మారింది. స్వార్థం, ఈర్ష్య వినాశనానికి దారి తీస్తుంది. యుద్దంలో వచ్చే రక్తమే స్వేచ్ఛకు తెర తీస్తుంది అని. ఇప్పుడు హైలెట్ గా మారింది.