Thalapathy Vijay : తమిళనాడు : ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ దళపతి విజయ్ తమిళనాడు రాష్ట్రంలో సంచలనంగా మారారు. ఇటీవలే మధురై కేంద్రంగా టీవీకే సమావేశం నిర్వహించారు. ఏకంగా 4 లక్షల మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. రాష్ట్రంలో వచ్చే శాసన సభ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకునేది లేదని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేసే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. టీవీకే అధికారికంగా కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు టీవీకే పార్టీ అధ్యక్షుడు దళపతి విజయ్ (Thalapathy Vijay) సెప్టెంబర్ నెలాఖరులో తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి కేంద్రం నుండి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు శ్రీకారం చుట్టనున్నారని సంచలన ప్రకటన చేసింది. దీంతో ఆయన పూర్తిగా ఇందులో లీనం అవుతున్నారని తేలి పోయింది.
Thalapathy Vijay Tour
ఇదిలా ఉండగా కోట్లాది మంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు దళపతి విజయ్ నిర్వహించే ‘మీట్ ది పీపుల్’ రాష్ట్ర వ్యాప్త పర్యటన కోసం పార్టీ అంతర్గత వర్గాలు ఈ ప్రచారానికి ఆతిథ్యం ఇవ్వడానికి తిరుచ్చి ముందు వరుసలో ఉందని సూచించాయి. మొదటి దశ దాదాపు ఒక వారం పాటు కొనసాగి దాదాపు 10 జిల్లాలను కవర్ చేస్తుందని భావిస్తున్నారు . నటుడు-రాజకీయ నాయకుడు గత నెలలో మధురైలో జరిగిన తన పార్టీ రెండవ రాష్ట్ర సమావేశంలో ఈ పర్యటనను ప్రకటించారు. తన రాజకీయ ప్రచారాన్ని నేరుగా అట్టడుగు వర్గాలకు తీసుకెళ్లాలని హామీ ఇచ్చారు. పెద్ద ఎత్తున రోడ్ షోలు, క్రాస్ రోడ్స్ లలో ప్రసంగిస్తారని పార్టీ ప్రకటించింది. కాగా తమిళనాడు ఎన్నికల రంగంలో దాని రాజకీయ ప్రాముఖ్యతతో పాటు, నగరం తో పాటు చుట్టు పక్కల డెల్టా జిల్లాలు చోళ సామ్రాజ్యానికి పుట్టినిల్లుగా ప్రతీకాత్మక విలువను కలిగి ఉన్నాయి. దీనిని పార్టీ ఉపయోగించు కోవాలని ఆసక్తిగా చూస్తోంది.
Also Read : CM Revanth Reddy Shocking Comments : హరీశ్ నా కాళ్లు మొక్కడం అబద్దం : సీఎం
















