TGSRTC : హైదరాబాద్ : పండుగలు వస్తున్నాయంటే ఎవరైనా సంతోష పడతారు. కానీ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) అంటేనే జనం జడుసుకుంటున్నారు. ఇప్పటికే ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నామని, దాని కారణంగా ఆర్టీసీ (TGSRTC) సంస్థ నష్టాల్లో ఉందని పేర్కొంటన్నారు. ఇది పక్కన పెడితే మొన్నటికి మొన్న రాఖీ పండుగ పేరుతో 30 శాతం ప్రస్తుతం ఉన్న ఛార్జీలకు అదనంగా పెంచింది. ప్రయాణీకులకు షాక్ ఇచ్చింది. తాజాగా దసరాతో పాటు బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే సర్కార్ ఈనెల 21 నుంచి అక్టోబర్ 2 వరకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. దీంతో తమ సుదూర ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఇదే సమయంలో బస్సులు ఎక్కాలంటే భయ పడుతున్నారు. ఆ స్థాయికి తీసుకు వచ్చింది ఆర్టీసీ.
TGSRTC Shocking Prices for Dussehra
దసరాకు ముందు ఛార్జీల పెంపుపై ప్రయాణికులు ఆర్టీసీపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రతి పండుగ సందర్భంగా కార్పొరేషన్ 50 శాతానికి పైగా పెంచడం పట్ల ఫైర్ అవుతున్నారు. శనివారం నుండి అక్టోబర్ 6 వరకు 7,754 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ప్రకటించింది. అయితే ఉపశమనం కలిగించడానికి బదులుగా, ఈ చర్య ప్రయాణికుల నుండి కొత్త విమర్శలకు దారి తీసింది. కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ వంటి సుదూర ప్రాంతాలకు ప్రయాణించడం అసౌకర్యంగా మారిందని, నగర బస్సులను కూడా దారి మళ్లించి ప్రత్యేక సర్వీసులుగా ముద్ర వేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రత్యేక ఏర్పాట్ల పేరుతో ఛార్జీలను పెంచుతుందని ఆరోపిస్తున్నారు. సాధారణ రోజున రూ.100 టికెట్ ప్రత్యేక బస్సులో రూ.150 ఖర్చవుతుంది, అయితే రూ.200 టికెట్ రూ.300 వరకు పెరగవచ్చు. కొత్త సర్వీసులను జోడించడానికి బదులుగా, ఛార్జీలను పెంచడానికి RTC తన సాధారణ డిపో బస్సులపై ‘ప్రత్యేక’ బోర్డులను ఉంచుతోందని చాలా మంది ఆరోపిస్తున్నారు.
Also Read : Ex DSP Nalini Shocking Letter : మాజీ డీఎస్పీ నళిని బహిరంగ లేఖ
















