TGPWU Chief : హైదరాబాద్ : డ్రైవర్లకు న్యాయమైన వేతనాలు, వినియోగదారులను దోపిడీ ధరల నుండి రక్షించడానికి టాక్సీ ఛార్జీల నియంత్రణ లేక పోవడాన్ని హైకోర్టులో సవాలు చేశారు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) ప్రెసిడెంట్ షేక్ సలావుద్దీన్ (TGPWU Chief). మోటార్ వెహికిల్స్ చట్టం 1988 ప్రకారం రాష్ట్రంలో టాక్సీ ఛార్జీల నియంత్రణ లేక పోవడాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. ఈ మేరకు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. యాప్ ఆధారిత టాక్సీ అగ్రిగేటర్లు తాము అనుకున్నట్లు ఛార్జీలు వసూలు చేస్తూ డ్రైవర్లు, వినియోగదారులు ఇరువురినీ కష్టాల్లోకి నెట్టేస్తున్నారని పిటిషన్‌లో హైలైట్ చేశారు.
TGPWU Chief Salahuddin Files a Petition
మోటార్ వెహికిల్స్ చట్టం 1988 లోని సెక్షన్ 67 ప్రకారం తెలంగాణలో నడిచే అన్ని కాంట్రాక్ట్ క్యారేజీలకు ఏకరీతీ ఛార్జీలు నిర్ణయించాలని, గెజిట్‌లో నోటిఫై చేయాలని కోరారు షేక్ సలావుద్దీన్. 1988 సెక్షన్ 74 మరియు లీగల్ మెట్రాలజీ చట్టం 2009 ప్రకారం టాక్సీమీటర్ల ఇన్‌స్టాలేషన్, వెరిఫికేషన్‌ను నిర్ధారించాలని కోరారు. నోటిఫై చేసిన ఛార్జీల అమలు పర్యవేక్షణ కోసం ఒక మానిటరింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
డ్రైవర్లు, వినియోగదారుల రెండింటికీ అందుబాటులో ఉండేలా, ఫిర్యాదుల పారదర్శక పరిష్కారం కోసం ఒక గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టమ్ ఏర్పాటు చేసి పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని కోరారు షేక్ సలావుద్దీన్. ఇదిలా ఉండగా ఈ పిటిషన్ తెలంగాణ హైకోర్టుల న్యాయమూర్తి కె. సారత్ ఎదుట గురువారం విచారణకు వచ్చింది. సీనియర్ కౌన్సిల్ ఎల్. రవిచందర్ టీజీండ్ ప్లాట్ ఫారమ్ వర్కర్స్ యూనియన్ తరఫున వాదనలు వినిపించగా, అడ్వకేట్ మహమ్మద్ అబ్సర్ అహ్మద్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న అనంతరం కోర్టు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
డ్రైవర్లకు న్యాయమైన వేతనాలు కల్పించడానికీ, వినియోగదారులను టాక్సీ అగ్రిగేటర్ల దోపిడీ ధరల నుండి రక్షించడానికీ ఈ కేసు అత్యంత ముఖ్యమైనది. ఈ రంగంలో నియంత్రణ, పారదర్శకత అత్యవసరం అని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలాహుద్దీన్ స్పష్టం చేశారు.
Also Read : Supreme Court Shocking : భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ను రద్దు చేయలేం
















