TGPSC Group-2 Interesting Updates : 23 నుండి గ్రూప్-2 సర్టిఫికెట్స్ వెరిఫికేష‌న్

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ వెల్ల‌డి

Hello Telugu - TGPSC Group-2 Interesting Updates

Hello Telugu - TGPSC Group-2 Interesting Updates

TGPSC Group-2 : హైద‌రాబాద్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీజీపీఎస్సీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆదివారం అధికారికంగా గ్రూప్ -2 కు సంబంధించి అప్ డేట్ ఇచ్చింది. ఈనెల సెప్టెంబర్ 23 నుండి గ్రూప్-II (TGPSC Group-2) సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తుంద‌ని తెలిపింది. వెబ్ ఆప్షన్లను సమర్పించేటప్పుడు అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ఉండాలని కమిషన్ హెచ్చరించింది. ఎందుకంటే వీటిని ఎంపికకు తుదిగా పరిగణిస్తారు. గ్రూప్-II సేవల కింద ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్‌ను ప్రకటించింది. వెరిఫికేషన్ సెప్టెంబర్ 23 , 24 తేదీలలో ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు జరుగుతుందని తెలిపింది.

TGPSC Group-2 Certificate Verification Updates

అర్హులై అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.tspsc.gov.in](https://www.tspsc.gov.in నుండి వెరిఫికేషన్ మెటీరియల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని స్ప‌ష్టం చేసింది. సెప్టెంబర్ 22 , 25 మధ్య TSPSC పోర్టల్‌లో తమ వెబ్ ఆప్షన్‌లను కూడా ఉపయోగించు కోవాలని సూచించింది తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిషన్. వెబ్ ఆప్షన్‌లను సమర్పించేటప్పుడు అభ్యర్థులు చాలా జాగ్రత్తగా వ్య‌వ‌హ‌రించాల‌ని, మ‌రోసారి స‌రి చూసుకోవాల‌ని కోరింది. ఇదే ఫైన‌ల్ గా తాము ప‌రిగ‌ణిస్తామ‌ని పేర్కొంది. ఇచ్చిన తేదీలలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కాకపోతే అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుందని కూడా పేర్కొంది. మరిన్ని వివరాల కోసం, అభ్యర్థులు కమిషన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని స్ప‌ష్టం చేసింది టీజీపీఎస్సీ.

Also Read : Hydraa Operation Sensational : గాజులరామారంలో హైడ్రా ఆపరేషన్

Exit mobile version