Speaker Gaddam Prasad : హైదరాబాద్ – బీఆర్ఎస్ పార్టీ గుర్తు నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జంప్ అయిన 10 మంది ఎమ్మెల్యేలకు కోలుకోలేని షాక్ తగిలింది. వారిపై చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తూ వచ్చిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad) పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది భారత దేశ సర్వోన్నత ప్రధాన న్్యాయస్థానం సుప్రీంకోర్టు. కేవలం 3 నెలలు మాత్రమే టైం ఇచ్చింది. ఈ సమయంలో గనుక స్పీకర్ చర్యలు తీసుకోక పోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో స్పీకర్ దిద్దుబాటు చర్యలకు దిగారు. ఇందుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశంపై న్యాయ సలహా తీసుకకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఫిరాయింపునకు పాల్పడిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది.
Telangana Speaker Gaddam Prasad Shocking
ఈ చర్చల్లో అడ్వొకేట్ జనరల్ తో పాటు అనుభవం కలిగిన లాయర్లు కూడా స్పీకర్ తో చర్చించడంతో చివరకు నోటీసులు ఇష్యూ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇచ్చింది. తమ ముందుకు వచ్చి వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలలో కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్, సంజయ్‌కుమార్, తెల్లం వెంకట్రావు, అరెకపూడి గాంధీ, కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, కృష్ణ మోహన్ రెడ్డి, మహిపాల్‌రడ్డిలు ఉన్నారు. వీరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కోరింది.
Also Read : Sheikh Salahuddin – GIG Sensational Report : గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ రిపోర్ట్
















