TG High Court : హైదరాబాద్ – తెలంగాణ హైకోర్టు కోలుకోలేని ఝలక్ ఇచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్ కు. జస్టిస్ ఘోష్ సమర్పించిన కాళేశ్వరం కమిషన్ నివేదికపై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ రిపోర్టుపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారో చెప్పాలంటూ నిలదీసింది. దీనికి ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ నీళ్లు నమిలారు. చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ , జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్ లతో కూడిన హైకోర్టు (TG High Court) డివిజన్ బెంచ్ ఇవాళ్టి వరకు ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని లేకపోతే సీరియస్ యాక్షన్ కు సిఫారసు చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ ఎ. సుదర్శన్ రెడ్డిని ఆదేశించింది.
TG High Court Shocking CM Revanth Govt
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ విచారణ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు చర్య తీసుకుంటుందో తెలంగాణ హైకోర్టు తెలుసు కోవాలనుకుంది. కమిషన్ నివేదికను అసెంబ్లీ ముందు ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందా లేదా ముందుగా చర్య తీసుకుని, ఆపై తీసుకున్న చర్య నివేదికతో పాటు నివేదికను అసెంబ్లీ ముందు ప్రవేశ పెట్టాలని అనుకుంటున్నారా అని కోర్టు ప్రశ్నించింది. . కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని మంత్రి మండలి నిర్ణయించిందని అడ్వకేట్ జనరల్ సమర్పించిన తర్వాత ధర్మాసనం ఈ వివరణ కోరింది. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బాధపడ్డ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు , మాజీ మంత్రి టి. హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నివేదిక పూర్తిగా తప్పుల తడకగా ఉందన్నారు.
Also Read : CM Revanth Reddy New Innovation : జాతీయ రహదారులను కలిపేలా ఫ్యూచర్ సిటీ















