TG High Court : హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నుంచి కీలక అప్ డేట్ వచ్చింది. ఇటీవల గ్రూప్ -1 పరీక్షల నిర్వాకంపై తెలంగాణ హైకోర్టు (TG High Court) సంచలన తీర్పు ఇచ్చింది. ఈ సందర్బంగా దీనిని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ కు వెళ్లనున్నట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా గత ఏడాది అక్టోబర్ లో గ్రూప్ -1 పరీఓను నిర్వహించింది టీజీపీఎస్సీ. ఈ పరీక్షల నిర్వహణ పూర్తిగా అసంపూర్తిగా, తప్పుల తడకగా ఉందంటూ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గ్రూప్-I మెయిన్ పరీక్షల సమాధాన పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలని లేదా ఎనిమిది వారాల్లోగా తిరిగి పరీక్ష నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ గణనీయమైన పరిణామం 563 ఖాళీలకు పరీక్ష రాసిన 21,000 మంది అభ్యర్థులపై ప్రభావం చూపింది.
TG High Court – TGPSC Shocking
ఈ తరుణంలో సింగిల్ బెంచ్ తీర్పుపై టీజీపీఎస్సీ సవాల్‌ను డివిజన్ బెంచ్ విచారించనుంది . సెప్టెంబర్ 9న గ్రూప్ 1 ఫలితాలు, ర్యాంకులను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం డివిజన్ బెంచ్‌కు అప్పీల్ దాఖలు చేసింది. సంజయ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మెయిన్స్ సమాధాన పత్రాలను తిరిగి మూల్యాంకనం చేసి 563 పోస్టులకు నియామకాలను పూర్తి చేయాలని లేదా అక్టోబర్ 21 నుండి 27 వరకు నిర్వహించిన మెయిన్స్ పరీక్షలను రద్దు చేసి వాటిని తిరిగి నిర్వహించాలని సింగిల్ బెంచ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ఆదేశించింది. పోస్టులను అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అభ్యర్థులు పెద్ద ఎత్తున పరీక్షలను రద్దు చేయాలని కోరుతున్నారు.
Also Read : Nirmala Sitharaman – GST 2.0 Growth : జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు భారీ లాభం – ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
















