TG High Court : హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు హైడ్రా కూల్చి వేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి ఆదేశాలను విస్మరించినందుకు కమిషనర్ ఏవీ రంగనాథ్ పై మండిపడింది. తెల్లవారుజామున ఎలాంటి ముందస్తు నోటీసులు , సమాచారం లేకుండా ఎలా కూల్చి వేస్తారంటూ ప్రశ్నించింది. హైడ్రా (Hydraa) నిర్వాకంపై హైకోర్టు మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది, పదేపదే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ అధికార యంత్రాంగం కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూనే ఉందని పేర్కొంది. ఉదయం వేళల్లో కూల్చివేతలు ఎందుకు జరుగుతున్నాయని కోర్టు ప్రశ్నించింది . స్పష్టమైన సూచనల తర్వాత కూడా హైడ్రా విధానాలను పాటించడంలో విఫలమైందని మండిపడింది.
TG High Court Slams Hydraa Commissioner AV Ranganath
గచ్చిబౌలిలో సంధ్య కన్వెన్షన్‌కు చెందిన నిర్మాణాల కూల్చివేతపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది హైకోర్టు ధర్మాసనం. ఇదిలా ఉండగా సర్కార్ నుంచి హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, ఎన్ఓసీ పొందిందని సంధ్య కన్వెన్షన్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. కోర్టు ఆదేశాలు జారీ చేసినా కూల్చి వేశారంటూ తెలియ చేశారు. కూల్చివేతకు ముందు ముందస్తు నోటీసు ఇవ్వలేదని, ఇది సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించిందని ఆవేదన వ్యక్తం చేశారు న్యాయవాదులు. పిటిషనర్లకు తమ వాదన వినిపించడానికి అవకాశం ఇవ్వకుండా హైడ్రా వ్యవహరించిందని తెలిపారు.
కాగా ప్రభుత్వం తరపున వాదించిన అదనపు అడ్వకేట్ జనరల్ మొహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ మీడియా నివేదికల ఆధారంగా దురుద్దేశంతో కూడిన ఆరోపణలు చేస్తున్నారని వాదించారు.అయితే, హైడ్రో అధికార పరిధికి సంబంధించి కోర్టు క్లిష్టమైన ప్రశ్నలను లేవనెత్తింది. ఆ ప్రాంతం ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హౌసింగ్ సొసైటీకి చెందినదని, ప్రభుత్వ భూమి కానందున, అంతర్గత రోడ్లకు సంబంధించిన విషయాలలో జోక్యం చేసుకునే అధికారం హైడ్రోకు ఉందా అని ప్రశ్నించింది. చట్టపరమైన కారణాల వల్ల కాకుండా, సొసైటీలోని కొంతమంది వ్యక్తుల ఆదేశం మేరకు హైడ్రో కూల్చివేతలను నిర్వహించినట్లు కనిపిస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది.
Also Read : CM Chandrababu Interesting Comments : దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా


















