TG High Court-BC Reservation Sensational : బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై తీర్పు రేప‌టికి వాయిదా

స్ప‌ష్టం చేసిన తెలంగాణ హైకోర్టు ధ‌ర్మాస‌నం

Hello Telugu - TG High Court-BC Reservation Sensational

Hello Telugu - TG High Court-BC Reservation Sensational

TG High Court : హైద‌రాబాద్ : స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు ఇవ్వడంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్ల‌పై బుధ‌వారం తెలంగాణ హైకోర్టు (TG High Court) విచార‌ణ చేప‌ట్టింది. ఇవాళ కేసుకు సంబంధించి తీవ్ర వాదోప వాద‌న‌ల‌ను చోటు చేసుకున్నాయి. ఇంప్లీడ్ పిటిషన్లపై వాదనలు వినిపించారు న్యాయ‌వాదులు. ఈ సంద‌ర్బంగా అసెంబ్లీలో బిల్లు పాస్ అయిందా అని ప్రశ్నించారు చీఫ్ జస్టిస్ . 42 శాతం రిజర్వేషన్ బిల్లు పాస్ అయింది కానీ గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నట్లు తెలిపారు పిటీషనర్ తరపు న్యాయవాది. 50 శాతం రిజర్వేషన్ దాటొద్దని సుప్రీంకోర్టు తీర్పు ఉంద‌ని జ‌స్టిస్ కు తెలిపారు. తుది తీర్పు వెలువ‌డేంత వ‌ర‌కు ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ ఇవ్వ వ‌ద్ద‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంద‌న్నారు.

TG High Court Key Update on BC Reservations

ఈ విష‌యాన్ని ధ‌ర్మాస‌నం దృష్టికి తీసుకు వెళ్లారు. కేవలం షెడ్యూల్ మాత్రమే విడుదల చేశారని వివరణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. మొత్తం వాదోప వాద‌న‌లు విన్న అనంత‌రం ధ‌ర్మాసనం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు ఇవాళ తుది తీర్పు వెలువ‌రించేందుకు వీలు కాద‌ని స్ప‌ష్టం చేసింది. ఇందులో భాగంగా అక్టోబ‌ర్ 9వ తేదీ గురువారం నాడు అంతిమ నిర్ణ‌యం వెలువ‌రిస్తామ‌ని పేర్కొంది. అయితే ఈ సందర్భంగా ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నలు వేసింది. గవర్నర్ దగ్గర బిల్లు ఎప్పటి నుండి పెండింగ్‌లో ఉంది.. ట్రిపుల్ టెస్టు విధానాన్ని అమలు చేశారా? బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ ఎలా నిర్వహించారు..? కమిషన్ రిపోర్ట్ పబ్లికేషన్ చేశారా? ప్రజల అభ్యంతరాలు తీసుకున్నారా అని ప్రశ్నించింది హైకోర్టు.

Also Read : UK PM Keir Starmer Important Visit : పీఎం యష్ రాజ్ ఫిల్మ్స్ స్టూడియో సంద‌ర్శన‌

Exit mobile version