TG High Court : హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ కు బిగ్ షాక్ ఇచ్చింది హైకోర్టు (TG High Court). స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని స్పష్టం చేసింది. ఇది మంచి పద్దతి కాదని పేర్కొంది. శుక్రవారం ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కేసు విచారణ చేపట్టింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ చర్చించి వెంటనే తెలపాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఇదిలా ఉండగా హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. రీ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని దావాలో పిటిషన్ పేర్కొన్నారు. ఈ నెల 9న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. దీనిని సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.
TG High Court Shocking Congress Govt
ఈ కేసు విచారణను తదుపరి 2 వారాలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తన్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఇవ్వడం కుదరదంటూ తేల్చి చెప్పింది భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఇప్పటికే అమలుపై స్టే ఇచ్చింది రాష్ట్ర తెలంగాణ హైకోర్టు. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం హైకోర్టు లోనే తేల్చు కోవాలని స్పష్టం చేసింది. దీనిపై తేల్చుకోవాల్సింది మీరేనంటూ పేర్కొంది. మరో వైపు తమకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ఈనెల 18న శనివారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చింది.
Also Read : YS Sharmila Fired on PM Modi : బీహార్ ఎన్నికల కోసం మోదీ కాషాయ వేషం


















