TG High Court : హైదరాబాద్ – గత కొంత కాలంగా హైడ్రా పనితీరుపై, కమిషన్ ఏవీ రంగనాథ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చిన తెలంగాణ హైకోర్టు ఎట్టకేలకు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక రకంగా హైడ్రా పనితీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పర్యావరణ హితమైన నగరంగా హైదరాబాద్ ను తీర్చి దిద్దడానికి కృషి చేస్తున్న హైడ్రాను హైకోర్టు (TG High Court) ప్రశంసించింది. ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు, రహదారులు, పార్కులను కాపాడేందుకు హైడ్రా వంటి సంస్థలు అవసరముందని పేర్కొంది. రహదారులపై రాక పోకలకు ఆటంకంగా నిర్మించిన వాటిని తొలగించే విషయంలో హైడ్రా ఫోకస్ పెట్టాలని స్పష్టం చేశారు హైకోర్టు న్యాయమూర్తి విజయసేనా రెడ్డి.
TG High Court Appreciates Hydraa
రాంనగర్ మనెమ్మ గల్లీ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ రోడ్డు ఆక్రమణపై జీహెచ్ ఎంసీకి గతంలో ఫిర్యాదు చేసింది. హైడ్రా సహకారాన్ని జీహెచ్ ఎంసీ కోరింది. దీంతో హైడ్రా రంగంలోకి దిగి.. జమినిస్తాన్పూర్, రామ్ నగర్ క్రాస్ రోడ్డును ఆక్రమించి నిర్మించిన వాణిజ్య సముదాయాన్ని హైడ్రా తొలగించింది. దీంతో రామ్ నగర్ ప్రధాన రహదారికి వెళ్లేందుకు అవకాశం లభించింది. అయితే ఈ విషయమై రోడ్డుపై వాణిజ్య సముదాయాన్ని నిర్మించిన వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసు విచారణకు రాగా హైడ్రా కూల్చి వేయడం సబబేనని పేర్కొన్నారు. రహదారులను ఆక్రమించేసి రాకపోకలకు ఆటంకం కలిగించే నిర్మాణాలను తొలగించడంలో HYDRAA వంటి సంస్థలు ముఖ్యమైనవని హైకోర్టు పేర్కొంది. ఎప్పుడైనా ప్రజా ప్రయోజనాలకు లోబడి ప్రైవేట్ ప్రయోజనాలు ఉండాలని కూడా వ్యాఖ్యానించింది. ప్రజా ఆస్తులు, నీటి వనరులను కాపాడడంలో నగరం అంతటా చేస్తున్న కృషి ఇలాగే కొనసాగాలని స్పష్టం చేసింది.
Also Read : Vizag Steel Plant Clarification Interesting : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు

















