Rohit Sharma : ఆస్ట్రేలియా : ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత జట్టు రెండో వన్డే మ్యాచ్ ఆడేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే తొలి వన్డేలో 7 వికెట్ల ఏతడాతో ఆతిథ్య జట్టు ఆసిస్ తో ఘోర పరాజయం మూటగట్టుకుంది. టాప్ ఆర్డర్ కుప్పకూలింది ఆసిస్ బౌలర్ల ధాటికి. పెర్త్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా నిలిచింది. చివరకు డక్ వర్త్ లూయిస్ ప్రకారం 26 ఓవర్లకు మ్యాచ్ ను కుదించారు. ఇండియా 9 వికెట్లు కోల్పోయి 136 రన్స్ చేసింది. ఈ లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది టీమిండియా. ఓపెనర్లు కోహ్లీ, కెప్టెన్ శుభ్ మన్ గిల్, రోహిత్ శర్మ , శ్రేయాస్ అయ్యర్ నిరాశ పరిచారు. కేఎల్ రాహుల్ , అక్షర్ పటేల్ లు మాత్రమే రాణించారు.
Rohit Sharma – Virat Kohli Sensational
మరో వైపు స్టార్ ఆటగాళ్లు రోహిత్ (Rohit Sharma) భాయ్, విరాట్ కోహ్లీలకు సంబంధించి వన్డే ఫార్మాట్ లో ఇదే ఆఖరి టోర్నీగా భావిస్తున్నారు. మరో వైపు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఉండడంతో వీరి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఎవరు ఎప్పుడు జట్టులో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో 2వ వన్డే మ్యాచ్ మరింత కీలకంగా మారింది. ఈ మ్యాచ్ ఒక రకంగా చెప్పాలంటే ఈ ఇద్దరి ఆటగాళ్లకు అగ్ని పరీక్షగా మారింది. రాణిస్తే ఉంటారు లేక పోతే నిర్దాక్షిణ్యంగా తొలగించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రస్తుతం ప్రాక్టీస్ సెషన్ లో బిజీగా మారారు. ప్రాక్టీస్ లో మునిగి పోయారు.
Also Read : Tejashwi Yadav Challenge : కాంట్రాక్టు కార్మికులకు శాశ్వత ఉద్యోగాలు


















