Tesla New Innovation : భారత్ లోని ప్రధాన నగరాల్లో టెస్లా విక్రయ కేంద్రాలు

ఈ నగరాల్లో టెస్లా వాహనాలకు గణనీయమైన డిమాండ్ ఉన్నట్లు సంస్థ విశ్లేషించింది...

Hello Telugu - Tesla New Innovation

Hello Telugu - Tesla New Innovation

Tesla : ముంబై, ఢిల్లీ, బెంగళూరు: ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా, ఈ జూలై నెలలో భారత్‌లో తన తొలి అధికారిక షోరూమ్‌లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎలాన్ మస్క్ నేతృత్వంలో నడుస్తున్న ఈ అమెరికన్ దిగ్గజ సంస్థ, మొదటి దశలో చైనాలో తయారైన టెస్లా (Tesla) వాహనాలను దిగుమతి చేసుకుని దేశీయ మార్కెట్‌లోకి ప్రవేశించనుంది.

Tesla New Innovations in India

ఇందులో భాగంగా, దేశంలోని ప్రధాన మేట్రో నగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగళూరులో టెస్లా విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. ఈ నగరాల్లో టెస్లా వాహనాలకు గణనీయమైన డిమాండ్ ఉన్నట్లు సంస్థ విశ్లేషించింది. వినియోగదారులకు టెస్టు డ్రైవ్‌లు, కొనుగోలు సదుపాయాలు, మరియు సర్వీస్ సెంటర్లు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

భవిష్యత్తులో భారత్‌లోనే వాహనాలను తయారు చేయాలని టెస్లా యోచిస్తోంది. ఇందుకోసం సరైన ఉత్పత్తి సదుపాయాలు, సరఫరా (సప్లై చెయిన్) వ్యవస్థను అభివృద్ధి చేయాలనే దిశగా కంపెనీ ముందుకు సాగుతోంది.

భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, టెస్లా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీని ద్వారా టెస్లా తన గ్లోబల్ వ్యాపారాన్ని మరింత విస్తరించడమే కాకుండా, భారతదేశంలోని ఈవీ విపణిలో కూడా కీలక పాత్ర పోషించనుంది.

Also Read : Neeraj Chopra Sensational : గోల్డెన్ స్పైక్ ఈవెంట్ లో అగ్రస్థానంలో నీరజ్ చోప్రా

Exit mobile version