World Top Billionaires : ఆర్థిక అసమానతలపై చర్చలు కొనసాగుతున్నా, ప్రపంచ కుబేరుల (World Top Billionaires) సంఖ్య మాత్రం ఏడాది తర్వాత ఏడాది పెరుగుతూనే ఉంది. తాజా ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, 2025 జూలై నాటికి ప్రపంచ బిలియనీర్ల సంఖ్య 3,028కి చేరింది. వీరి కలిపిన సంపద విలువ అందరూ కలిపి 16.1 లక్షల కోట్ల డాలర్లు.
World Top Billionaires – ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో నిలిచినప్పటికీ సంపద తగ్గింది
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk), బిలియనీర్ల జాబితాలో అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. జూన్ నెలతో పోలిస్తే ఆయన సంపదలో 16 బిలియన్ డాలర్ల తగ్గుదల వచ్చినప్పటికీ, టాప్ ర్యాంక్‌ను కొనసాగించారు.
టాప్-10 బిలియనీర్ల జాబితా ఇలా ఉంది:
ఎలాన్ మస్క్ (టెస్లా) –
సంపద: 253.2 బిలియన్ డాలర్లు
లారీ ఎలిసన్ (ఒరాకిల్) –
సంపద: 248.6 బిలియన్ డాలర్లు
మార్క్ జుకర్‌బర్గ్ (మెటా/ఫేస్‌బుక్) –
సంపద: 247.9 బిలియన్ డాలర్లు
జెఫ్ బెజోస్ (అమెజాన్) –
సంపద: 236.8 బిలియన్ డాలర్లు
బెర్నార్డ్ ఆర్నాల్ట్ (ఎల్‌వీఎంహెచ్) –
సంపద: 147.7 బిలియన్ డాలర్లు
లారీ పేజ్ (గూగుల్) –
సంపద: 146.2 బిలియన్ డాలర్లు
వారెన్ బఫెట్ (బెర్క్‌షైర్ హాత్‌వే) –
సంపద: 143.1 బిలియన్ డాలర్లు
స్టీవ్ బామర్ (మైక్రోసాఫ్ట్) –
సంపద: 141.3 బిలియన్ డాలర్లు
సెర్గీ బ్రిన్ (గూగుల్) –
సంపద: 139.7 బిలియన్ డాలర్లు
జెన్సెన్ హువాంగ్ (ఎన్‌విడియా) –
సంపద: 137.9 బిలియన్ డాలర్లు
మైక్రోసాఫ్ట్ బిలగేట్స్ జాబితా వెలుపల
టాప్-10లో ఈసారి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కు చోటు దక్కలేదు. గత వారం రోజుల్లో ఆయన సంపదలో 30% తగ్గుదల రావడంతో స్థానభ్రంశం జరిగింది.
ఆసియాలో ముందున్న ముకేశ్ అంబానీ
ఆసియాలో అత్యంత ధనవంతుడిగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కొనసాగుతున్నారు. ఆయన సంపద 116 బిలియన్ డాలర్లుగా ఉండగా, 100 బిలియన్ క్లబ్‌లో చేరిన ఏకైక ఆసియా వ్యక్తిగా నిలిచారు. ప్రపంచ కుబేరుల్లో ఆయనకు 15వ స్థానం దక్కింది.
అమెరికా దినదినాభివృద్ధి
టాప్-10లో తొమ్మిది మంది అమెరికన్లే ఉండటం, అమెరికా వ్యాపార సామ్రాజ్యాల ప్రాబల్యాన్ని మరోసారి రుజువు చేస్తోంది. బిలియనీర్ల సంపద జూన్‌తో పోల్చితే 100 బిలియన్ డాలర్లు పెరిగి మొత్తం సంపద 2 లక్షల కోట్ల డాలర్లకు చేరడం గమనార్హం.
Also Read : Trump Warning : బ్రిక్స్ లో భాగమైన భారత్ 10% అదనపు టారిఫ్ చెల్లించాల్సిందే












