శ్రీ కపిలేశ్వర ఆలయంలో తెప్పోత్సవాలు

డిసెంబ‌ర్ 29 నుండి జ‌న‌వ‌రి 2వ తేదీ వరకు

hellotellugu-Teppottsavam

తిరుపతి : తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో డిసెంబ‌రు 29 నుండి జ‌న‌వ‌రి 2వ తేదీ వరకు తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయని తెలిపింది.

ఐదు రోజు లపాటు జరిగే తెప్పోత్సవాలలో మొదటి రోజైన డిసెంబ‌రు 29వ తేదీన శ్రీ వినాయక స్వామివారు, శ్రీ చంద్ర‌శేఖ‌ర్ స్వామివారు పుష్కరిణిలో 9 చుట్లు విహరిస్తారు. న‌వంబ‌రు 30న శ్రీ వ‌ళ్ళి దేవ‌సేన స‌మేత శ్రీ సుబ్రమణ్య స్వామివారు 9 చుట్లు, డిసెంబ‌రు 31న‌ శ్రీ సోమస్కంద స్వామివారు 9 చుట్లు, జ‌న‌వ‌రి 1న‌ శ్రీ కామాక్షి అమ్మవారు 9 చుట్లు, జ‌న‌వ‌రి 2న‌ శ్రీ చండికేశ్వర స్వామివారు , శ్రీ చంద్రశేఖర స్వామివారు తెప్పలపై 9 చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిస్తారు.

ప్రతిరోజూ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు ఊంజ‌ల సేవ‌, తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. జనవరి 3వ తేదీన ఆరుద్ర దర్శన మహోత్సవం సందర్భంగా ఉదయం 6 నుండి రాత్రి 9 గంటల వరకు శ్రీ నటరాజ స్వామివారు, శ్రీ శివగామి అమ్మవారు, శ్రీ మాణిక్యవాసగ స్వామివారి ఉత్సవ విగ్రహాలను పురవీధులలో ఊరేగించనున్నారు. తెప్పోత్సవాల సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంకీర్తనలు ఆలపిస్తారు.

Exit mobile version