విశాఖపట్నం జిల్లా : భారత క్రికెట్ రంగానికి చెందిన దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆదివారం ఏపీలో ప్రసిద్ద పుణ్య క్షేత్రమైన విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం అప్పన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు ఆలయ అధికారులు. కోహ్లీ రాకతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఇటీవల తను ఓన్డే ఫార్మాట్ లో అరుదైన రికార్డును నమోదు చేశారు. భారీ ఎత్తున పరుగుల వరద పారించారు. రెండు సెంచరీలు నమోదు చేశాడు. ఇక కోహ్లీ తన సందర్శన సమయంలో స్వామి వారికి ప్రత్యేకంగా పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆటగాళ్లను స్వాగతించారు. వారి దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్రికెటర్లు పవిత్ర కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకోవడం , బేడ మండపాన్ని ప్రదక్షిణ చేయడం వంటి సాంప్రదాయ ఆచారాలను నిర్వహించారు.
ఇదిలా ఉండగా భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీతో మరో స్టార్ క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ కూడా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామికి ప్రార్థనలు చేశారు. ఆలయ అధికారులు ఆటగాళ్లను స్వాగతించారు . వారి దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారు గర్భగుడి లోపల ప్రార్థనలలో పాల్గొని పూజారుల నుండి ఆశీర్వాదాలు పొందారు. దర్శనం తర్వాత, ఆలయ పూజారులు వేద శ్లోకాలను పఠించారు. స్వామి వారి చిత్ర పటంతో పాటు ప్రసాదాన్ని అందజేశారు కోహ్లీ, సుందర్ లకు.
