తెలుగు వారి ఆత్మ గౌర‌వం తెలుగుదేశం

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన నారా లోకేష్

hellotelugu-NaraLokesh

అమ‌రావ‌తి : రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్స‌వం. ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడారు. సూర్య చంద్రులు ఉన్నంత కాలం టీడీపీ ఉంటుంద‌న్నారు. దివంగ‌త మహా నాయ‌కుడు అన్న ఎన్టీఆర్ స్తాపించిన ఈ పార్టీ వేలాది మందికి వెలుగులు చూపించింద‌ని చెప్పారు. తెలుగు వారి ఆత్మ గౌరవం, అభ్యున్నతి కోసం పుట్టింది తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు నారా లోకేష్‌. సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు అని నినదించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ దివంగ‌త‌ ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో పేద ప్రజలకు అండగా నిలిచిందని అన్నారు.

టీడీపీ ఆవిర్భావం తర్వాతే సమాజంలో అణగారిన, బడుగు, బలహీనవర్గాలకు రాజకీయంగా, సామాజికంగా గుర్తింపు వచ్చిందని స్ప‌ష్టం చేశారు నారా లోకేష్ బాబు. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మ‌రోసారి గుర్తు చేశారు. ప్రపంచంలో తెలుగువారిని నెం.1గా చేయడమే లక్ష్యంగా స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌క‌త్వం క‌లిగిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో పార్టీ ముందుకు సాగుతోంద‌న్నారు. బ‌డుగు, బ‌ల‌హీన‌, పేద‌ల అభ్యున్న‌తి కోసం అహ‌ర్నిశ‌లు కృషి చేస్తున్నార‌ని తెలిపారు. దేశంలో ఎక్క‌డా లేని విదంగా సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్న ఘ‌న‌త ఒక్క ఏపీకి మాత్ర‌మే ఉంద‌న్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు నారా లోకేష్‌.

Exit mobile version