మీడియా స్వేచ్ఛ‌కు కేంద్రం ముకుతాడు

తీవ్ర కామెంట్స్ చేసిన శ్రీ‌నివాస్ రెడ్డి

hellotelugu-IJUSrinivasReddy

విజ‌య‌వాడ : కేంద్రం మీడియా స్వేచ్ఛ‌ను హ‌రించే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ఆరోపించారు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ శ్రీ‌నివాస్ రెడ్డి. న్యూఢిల్లీలోని యూఎన్ఐ కార్యాలయాన్ని ఇటీవల అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటనను ఆయన పెరుగుతున్న అసహనానికి ఉదాహరణగా పేర్కొన్నారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను మరింత అధికారాలతో మీడియా కౌన్సిల్ ఆఫ్ ఇండియాగా పునర్ వ్య‌వ‌స్థీక‌రించాల‌నే తీర్మానాన్ని ప్లీనరీ ఆమోదించిందని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు . ఐజేయూ ప్రధాన కార్యదర్శి బల్విందర్ సింగ్ జమ్ము మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా జర్నలిస్టుల పరిస్థితి దిగజారుతోందని అన్నారు. దాడులు, హత్యల వంటి ఘటనలు పెరుగుతున్నాయని వాపోయారు.

దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా విధులు నిర్వహించే సమయంలో జర్నలిస్టులు తీవ్రమైన ప్రమాదాలను ఎదుర్కొంటున్నారని అన్నారు. స్వేచ్ఛా భావ వ్యక్తీకరణపై అధికారుల అసహనం పెరుగుతోందని అన్నారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వై. సత్యనారాయణ (సుజనా చౌదరి) సోషల్ మీడియా నియంత్రణలేమిపై ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా సరైన నియంత్రణలు లేకుండా యాంటీ-సోషల్ మీడియాగా మారుతోంద‌న్నారు. జర్నలిజం విలువల ఆధారంగా ఉండాలన్నారు. వార్తల నిజానిజాలను నిర్ధారించే విధానాలు అవసరం. నేను నియంత్రణకు మద్దతు ఇవ్వడం లేదు, కానీ సరైన మార్గదర్శకాలు అవసరం అని పేర్కొన్నారు.

విశాలాంధ్ర ఎడిటర్ ఆర్.వి. రామారావు మాట్లాడుతూ మీడియా యాజమాన్యాల ఆధీనంలోకి వెళ్తోందని, స్వతంత్ర జర్నలిజాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. భయపడి కాకుండా స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తం చేసే స్వతంత్ర మీడియాను బలపరచడానికి ఐజేయూ చర్యలు తీసుకోవాలి అని సూచించారు. టిడిపి పార్లమెంటరీ పార్టీ లీడర్ ఎల్. కృష్ణ దేవరాయలు కూడా సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా అంబటి అంజనేయులు, కె. అమర్‌నాథ్, ప్రేమనాథ్ భార్గవ్, మాణికొండ చలపతి రావు వంటి మరణించిన సీనియర్ జర్నలిస్టులకు ఐజేయూ నాయకులు పుష్పాంజలి ఘటించారు

Exit mobile version