తెలంగాణ విద్యుత్ కార్మికుల సమ్మె విరమణ

ప్ర‌క‌టించిన జేఏసీ చైర్మ‌న్ స‌తీష్ ర‌డ్డి

hellotelugu-TGGENCO

హైద‌రాబాద్ : ప్రజల విశ్వాసాన్ని చూరగొనే విధంగా ఉద్యోగులు పని చేయాలని డిప్యూటీ సీం భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఉప ముఖ్యమంత్రిని క‌లిశారు విద్యుత్ కార్మికుల జేఏసీ చైర్మ‌న్ స‌తీష్ రెడ్డి. విద్యుత్ కార్మికుల సమస్యలపై ట్రాన్స్ కో చైర్మ‌న్, ఎండీ తో చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని డిప్యూటీ సీఎం సూచించారు. పూర్తి హామీ ఇవ్వ‌డంతో తాము స‌మ్మెను విర‌మించాల‌ని నిర్న‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు కార్మికుల త‌ర‌పున చైర్మ‌న్. ఇవాళ ఉద‌యం జేఏసీ నాయకులు హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో ఉప ముఖ్యమంత్రిని కలిశారు. తమ సమస్యలకు సానుకూలంగా స్పందించి, సీనియర్ అధికారులతో చర్చలకు అనుమతి ఇచ్చినందుకు గాను, కార్మికుల జేఏసీ కన్వీనర్ సాయిలు ఉప ముఖ్యమంత్రికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ఉద్యోగులు ప్రజల విశ్వాసాన్ని చూరగొనే విధంగా పని చేయాలని సూచించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఉద్యోగులు తమ విధులను ప్రజల ప్రశంసలు పొందే రీతిలో నిర్వర్తించాలని ఆయన నొక్కి చెప్పారు. ప్రస్తుతం సమ్మెలపై నిషేధం ఉన్నందున, అలాగే వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుకుంటున్నందున, ఆకస్మిక సమ్మెకు దిగడం సముచితం కాదని ఆయన సూచించారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించు కోవచ్చని పునరుద్ఘాటించారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం మానవీయ కోణంలో పరిశీలిస్తోందని హామీ ఇచ్చారు.

Exit mobile version