TG High Court Fired – HYDRA : హైడ్రా క‌మిష‌న‌ర్ తీరుపై హైకోర్టు సీరియస్

నోటీసులు ఇవ్వ‌కుండా కూల్చేసే అధికారం ఎక్క‌డిది

Hello Telugu - TG High Court Fired - HYDRA

Hello Telugu - TG High Court Fired - HYDRA

HYDRA  : హైడ్రా – తెలంగాణ హైకోర్టు భ‌గ్గుమంది. హైడ్రా తీరు ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ను క‌డిగి పారేసింది. అస‌లు నువ్వు ఏం అనుకుంటున్నావంటూ ఫైర్ అయ్యింది. మీకు ఎన్ని సార్లు చెప్పినా ఎందుక‌ని ప‌ట్టించు కోవ‌డం లేదంటూ నిల‌దీసింది. నోటీసులు ఇవ్వ‌కుండా భ‌వ‌నాల‌ను, స్థ‌లాల‌ను కూల్చే అధికారం మీకు ఎక్క‌డిది..? ఎవ‌రు ఇచ్చారో చెప్పాల‌ని మండిప‌డింది తీవ్ర స్థాయిలో. హైడ్రా అస‌లు ఏమ‌ని అనుకుంటోంది. మీకు ఏమైనా సూప‌ర్ ప‌వ‌ర్స్ ఉన్నాయా. లేక భార‌త రాజ్యాంగానికి అతీతంగా మీకు కొత్త చ‌ట్టం ఏమైనా ఉందా అని ఫైర్ అయ్యింది.

Telangana High Court Serious on HYDRA

చట్టాలకు అతీతమైన అధికారాలు హైడ్రాకు (HYDRA) ఏమైనా ఉన్నాయా అని నిల‌దీసింది హైకోర్టు. సర్వే చేయకుండా ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మాణాలను ఎలా నిర్ణయిస్తారని తీవ్ర స్థాయిలో సీరియ‌స్ అయ్యింది.
ట్యాంక్‌బండ్‌ పక్కనే ఉన్న సచివాలయం, నెక్లెస్‌రోడ్‌, ప్రసాద్‌ ఐమాక్స్‌లకి ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్లను నిర్ధారించారా అని అడిగింది హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ను. సున్నం చెరువు ప్రాంతంలో నోటీసులు ఇవ్వకుండా కూల్చడంపై హైడ్రాని నిలదీసింది. కూల్చుకుంటూ పోతే హైదరాబాద్‌ సగం ఖాళీ అయి పోతుంద‌ని పేర్కొంది. ఈ సంద‌ర్బంగా హైడ్రా త‌న ప‌రిధిలో తాను ఉంటే మంచిద‌ని లేక పోతే జైలుకు వెళ్లాల్సి వ‌స్తుంద‌ని వార్నింగ్ ఇచ్చింది. ఈ సంద‌ర్బంగా సున్నం చెరువు కూల్చివేతలపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. చివ‌ర‌కు ఇదే చివరి హెచ్చరిక అంటూ వార్నింగ్ ఇచ్చింది.

Also Read : YS Jagan Sensational Tweet : ఎన్డీఏ సర్కార్ పై మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్

Exit mobile version