Telangana High Court : హైదరాబాద్ – తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మేజిస్ట్రేట్ లు కార్య నిర్వహణ అధికారులుగా కాకుండా న్యాయాధికారులుగా ఆలోచించాలని స్పష్టం చేసింది. ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో బీఎన్ఎస్ సెక్షన్ 35 ప్రకారం పోలీసులు నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం సరికాదని పేర్కొంది ధర్మాసనం. తగిన కారణాలు లేకుండా నిందితులకు రిమాండ్ విధించొద్దని మేజిస్ట్రేట్ కోర్టులను హెచ్చరించిన తెలంగాణ హైకోర్టు . నిబంధనలకు విరుద్ధంగా తనను రిమాండుకు పంపించారని మేజిస్ట్రేట్ తీర్పును హైకోర్టులో (Telangana High Court) సవాల్ చేస్తూ బాధితుడు పిటిషన్ దాఖలు చేశారు. జూలై 7వ తేదీన 10:15 గంటలకు అరెస్టు చేసి, 8వ తేదీన 11:35 గంటలకు మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారని వాపోయారు.
Telangana High Court Key Comments
నిబంధనల ప్రకారం అరెస్టు చేసిన 24 గంటల లోపు కోర్టులో హాజరు పరచాలని, కేసు డైరీతో పాటు రిమాండ్ రిపోర్టును కూడా పరిశీలించి రిమాండుకు తగిన కారణాలు నమోదు చేయాలని మెజిస్ట్రేట్ ను ఆదేశించారు హైకోర్టు న్యాయమూర్తి . ఈ కేసులో పిటిషనర్‌ను సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా రిమాండుకు తరలించారని, రిమాండ్ ఉత్తర్వులు రద్దు చేస్తూ నిందితుడిని వెంటనే విడుదల చేయాలని స్పష్టం చేశారు. కేసును పరిశీలించే సమయంలో అన్ని వైపులా ఆలోచించాలని మేజిస్ట్రేట్ లకు సూచించారు న్యాయమూర్తి. ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కులు ఉంటాయన్న సోయి తోనే విధులు నిర్వహించాలని ఘాటుగా పేర్కొన్నారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదని హితవు పలికారు. తాజాగా జడ్జి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : CM Revanth Reddy Fired on PM Modi : మోదీ..దమ్ముంటే బీసీలకు న్యాయం చేయాలి

















