Telangana Govt : హైదరాబాద్ – ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వివాదానికి తెర తీసిన బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి, ఆ ప్రాంత ప్రయోజనాలకు ఎలాంటి భంగం వాటిల్లదంటూ చిలుక పలుకులు పలికారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. దీనిపై చర్చించేందుకు ఇరు రాష్ట్రాల సీఎంలు ముందుకు వచ్చారు. ఢిల్లీ వేదికగా మాట్లాడుకుందాం దా అంటూ పిలుపునిచ్చారు.
Telangana Govt Shocking
ఈ కీలక సమయంలో ఉన్నట్టుండి యూ టర్న్ తీసుకుంది తెలంగాణ సర్కార్ (Telangana Govt). దీనిపై ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీరని నష్టం జరుగుతుందని, 200 టీఎంసీలు తీసుకు వెళ్లేందుకు చంద్రబాబు కుట్ర పన్నారంటూ ధ్వజమెత్తారు. ఇప్పటికే రాష్ట్రంలో సీఎంగా కొలువు తీరిన రేవంత్ రెడ్డి కావాలని తన గురువు చంద్రబాబుకు మేలు చేకూర్చేలా చేస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఈ కీలక సమయంలో తెలంగాణ సర్కార్ (Telangana Govt) బిగ్ షాక్ ఇచ్చింది ఏపీకి. ఢిల్లీలో కేంద్ర మంత్రి సమక్షంలో ఈనెల 16న బుధవారం జరిగే తెలంగాణ, ఏపీ సీఎంల సమావేశంలో బనకచర్లపై చర్చించాలని సింగిల్ ఎజెండా ఇచ్చించింది ఏపీ సర్కార్. దీనికి సంబంధించి ఏపీ ఇచ్చిన బనకచర్ల ఎజెండాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్రానికి మరో లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం.
ఇప్పటికే కృష్ణాపై పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, గతంలో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం పాలమూరు, డిండి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడం, తుమ్మడిహెట్టి వద్ద నిర్మించిన ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపుతో పాటు ఏబీఐపీ సాయం, ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలతో ఇప్పటికే ఎజెండాను పంపించింది సర్కార్. రేపటి సమావేశంలో బనకచర్లపై చర్చించాల్సిన అవసరం లేదని ఈ లేఖలో స్పష్టం చేసింది.
జీఆర్ఎంబీ, సిడబ్ల్యూసీ, ఈఏసీ బనకచర్లపై తీవ్ర అభ్యంతరాలు తెలిపాయని, ఇప్పటి వరకు బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేవంటూ పూర్తి వివరాలను ఈ లేఖలో ప్రస్తావించారు. అందుకే చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులన్నీ ఉల్లంఘించే బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని ఉటంకించారు. గోదావరి – బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించటం అనుచితమని లేఖ రాసింది.ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని అందులో ప్రస్తావించింది.
Also Read : Minister Atchannaidu Approved : పొగాకు కొనుగోళ్లలో వేగం పెంచండి – అచ్చెన్న
















