Telangana Govt : ఢిల్లీ – కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడులతో పాటు నీటి పారుదల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా చంద్రబాబు (CM Chandrababu) పూర్తిగా గోదావరి బనకచర్ల ప్రాజెక్టు పైనే ఫోకస్ పెట్టారు. సింగిల్ పాయింట్ ఎజెండాగా ప్రతిపాదించారు. మరో వైపు తెలంగాణ సర్కార్ 13 అంశాలను ప్రతిపాదించింది తెలంగాణ సర్కార్.
Telangana Govt Demands
పాలమూరు- రంగారెడ్డి, డిండి, సమ్మక్క సాగర్, ప్రాణహిత చేవెళ్ల సహా కీలక ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని ప్రతిపాదనల్లో పేర్కొంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇవ్వాలని కోరింది. శ్రీశైలం నుంచి వేరే బేసిన్ కి ఆంధ్రప్రదేశ్ నీటి తరలింపు పనులను వెంటనే ఆపేయాలి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రారంభించిన ప్రాజెక్టులకు సహకరించేలా కృష్ణ ట్రిబ్యునల్ లో మద్దతుగా వాదించేలా ఏపీని ఒప్పించాలి.
కృష్ణానది జలాలను వేరే బేసిన్ కు తరలించకుండా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చర్యలు తీసుకునేలా ఆదేశించాలి. కృష్ణా జలాలను అక్రమంగా తరలింపును అడ్డుకునేందుకు టెలిమెట్రీలను ఏర్పాటు చేసేందుకు ఏపీ ఒప్పుకోవాలని కోరింది. తుంగభద్ర బోర్డు నీటి తరలింపు పై చర్చించాలని కోరింది.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంపై ఎన్జీటీ ఉత్తర్వులను అమలు చేసే విధంగా కేంద్ర జలశక్తి శాఖ చర్యలు తీసుకోవాలి . ఆ మేరకు పునరుద్ధరణ జరపాలని సూచించింది. ఈ పథకంపై చట్టపరంగానే ముందుకు వెళ్లాలని స్పష్టం చేసింది.
శ్రీశైలం కుడి కాలువ ద్వారా ఎక్కువ నీటి తరలింపుతో పాటు కొత్త ప్రాజెక్టులు హంద్రీనీవా, వెలిగొండ, గురు రాఘవేంద్ర నిర్మాణాలను నియంత్రించాలని కోరింది. శ్రీశైలం డ్యాం సేఫ్టీ కి తగిన చర్యలు తీసుకోవాలి. శ్రీశైలం నుంచి నీటి తరలింపు ద్వారా విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలుగుతుంది దీనిని అడ్డుకోవాలి. పోలవరం ప్రాజెక్టు తరహాలోనే ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి.
Also Read : KTR fired on CM Revanth Reddy : సవాల్ విసిరి పారి పోయిన సన్నాసి రేవంత్ రెడ్డి


















