Telangana Govt : హైదరాబాద్ – తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆగస్టు 15, 16వ తేదీలలో రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ రామకృష్ణ రావు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్, ఇతర తెలంగాణ (Telangana Govt) జిల్లాలకు పాఠశాల వారంలో వరుసగా రెండు సెలవులు ఉన్నందున నాలుగు రోజులకు తగ్గించ బడుతుంది. 2025 ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం 15న శుక్రవారం , 16న శనివారం పాఠశాలలు మూసి వేస్తున్నట్లు స్పష్టం చేశారు.
Telangana Govt Gives Holidays to Schools on..
వచ్చే స్వాతంత్ర దినోత్సవం కారణంగా మొదటి సెలవు. విద్యార్థులు, ఉపాధ్యాయులు దేశభక్తి కార్యక్రమాలు, ఉత్సవాలకు హాజరవుతున్నందున జాతీయ సెలవు దినంలో పాఠశాలలు మూసి వేయడం జరుగుతోందని పేర్కొన్నారు. మరుసటి రోజు 16న శనివారం శ్రీ కృష్ణాష్టమి సెలవుదినం ప్రకటించినట్లు తెలిపింది. ఇది శ్రీ కృష్ణుడి జన్మదినాన్ని జరుపుకునే ముఖ్యమైన హిందూ పండుగ.
ఈ రెండు రోజుల్లో పాఠశాలలు మూసి వేయబడినప్పటికీ, చాలా విద్యాసంస్థలు తమ విద్యార్థులను స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధం చేస్తున్నాయి. విద్యార్థులు జెండా ఎగురవేసే వేడుకలు, దేశభక్తి గానం, సాంస్కృతిక కార్యక్రమాలు వంటి వివిధ కార్యకలాపాల్లో పాల్గొంటారు. కాగా 15, 16తో పాటు ఈనెల లోనే ఆగస్టు 27న వినాయక చవితి కోసం సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు సీఎస్. ప్రభుత్వ క్యాలెండర్ ఆధారంగా ఈ నెలలో ఈ ప్రాంతంలోని పాఠశాలలకు నాలుగు సాధారణ సెలవులతో పాటు ఒక ఐచ్ఛిక సెలవు కూడా ఉంది.
Also Read : EC Shocking Comments – Bihar Voters : బీహార్ లో కొత్త ఓటర్లపై ఈసీ కామెంట్స్


















