Telangana Govt : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ‘నా పుస్తకం నా కథ’ను ప్రారంభించింది. ఈ ప్రచారాన్ని రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయంలో అధికారికంగా ప్రారంభించారు జాయింట్ డైరెక్టర్ రాజీవ్, రూమ్ టు రీడ్ రాష్ట్ర లీడ్ నరసింహా చారి సమక్షంలో పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ నికోలస్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. పాఠశాల లైబ్రరీలను చదవడం, నేర్చుకోవడం కోసం కేంద్రాలను పునరుద్దరించడం దీని ముఖ్య ఉద్దేశం. తెలంగాణ (Telangana Govt) అంతటా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులలో అక్షరాస్యతను బలోపేతం చేయడానికి నా పుస్తకం నా కథ అనే రాష్ట్రవ్యాప్త పఠన ప్రచారం ప్రారంభించబడింది.
Telangana Govt Key Updates
ఈ కార్యక్రమం సెప్టెంబర్ 8 ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం వరకు కొనసాగుతుంది. గతంలో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (SCERT) సహకారంతో లైబ్రరీ పాయింట్ ఉపాధ్యాయులకు శిక్షణ నిర్వహించింది. ఈ ప్రచారం రూమ్ టు రీడ్ ఇండియా ట్రస్ట్‌తో భాగస్వామ్యంలో జరుగుతోంది. రోజు రోజుకు టెక్నాలజీ విస్తరిస్తోంది. అనేకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో భాగంగా పుస్తక పఠనం పట్ల పిల్లల్లో ఆసక్తి సన్నగిల్లుతోంది. పొద్దస్తమానం మొబైల్స్ ఫోన్ల ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో సృజనాత్మకతను కోల్పోతున్న విషయాన్ని ప్రధానంగా గమనించింది విద్యా శాఖ. రూమ్ టు రీడ్ సంస్థతో కలిసి విద్యార్థులలో క్రియేటివిటీ పెంపొందంచేలా , పుస్తకాలు చదివేలా ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టింది.
Also Read : Popular Maha Yagam Grand Conclusion : ముగిసిన శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహా యాగం
















