Metro Rail : హైదరాబాద్ – రాష్ట్రానికి చెందిన ఎంపీలకు చేపట్టనున్న మెట్రో రైల్ రెండో దశపై అవగాహన సదస్సు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం , మెట్రో రైల్ (Metro Rail) కార్పొరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టుకు సంబంధించి ఎంపీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Hyderabad Metro Rail Project
ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, రఘురామ రెడ్డి, పోరిక బలరాం నాయక్, అనిల్ కుమార్ యాదవ్‌లతో పాటు బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు.
మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టు వివరాలను మెట్రో రైల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్రంగా వివరించారు. ఈ ప్రాజెక్టు లక్ష్యాలు, ప్రణాళికలు, దాని ప్రభావం గురించి విస్తృతంగా తెలియజేశారు.
ఈ అవగాహన సదస్సు మెట్రో రైల్ రెండో దశ సాధనకు సంబంధించిన సమగ్ర వివరాలను ఎంపీలకు అందించడంలో కీలక పాత్ర పోషించింది, ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రవాణా సౌకర్యాలను మరింత మెరుగు పరచడానికి దోహద పడనుందని పేర్కొన్నారు మెట్రో ఎండీ. నగర వాసులకు రవాణా పరంగా దూరం తగ్గనుంది. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక రెండో దశ మెట్రో రైలు పనులపై ఫోకస్ పెట్టింది. కేంద్రం, రాష్ట్రం సంయుక్తంగా నిర్మాణం చేపట్టనున్నారు.
Also Read : Harish Rao Fired on Telangana Govt : తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్
















