DGP Shivadhar Reddy Growth : స్వంతూరిలో డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి

ఊరి జ‌నంతో మాట ముచ్చ‌ట

Hello Telugu - DGP Shivadhar Reddy Growth

Hello Telugu - DGP Shivadhar Reddy Growth

Shivadhar Reddy : రంగారెడ్డి జిల్లా : తెలంగాణ రాష్ట్ర పోలీస్ జ‌న‌ర‌ల్ (డీజీపీ) శివధ‌ర్ రెడ్డి (Shivadhar Reddy) త‌న స్వంత ఊరును సంద‌ర్శించారు. ఎంత గొప్ప స్థాయిలో ఉన్న‌ప్ప‌టికీ ఉన్న ఊరును మ‌రిచి పోకూడ‌ద‌ని ఆయ‌న గుర్తు చేశారు. 2014 నుంచి రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ప‌ని చేశారు. రాష్ట్రంలో ప్ర‌భుత్వం మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు డీజీపీగా ఉన్న జితేంద‌ర్ స్థానంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు నూత‌న డీజీపీగా కొలువు తీరారు శివ‌ధ‌ర్ రెడ్డి. ఆయ‌న స్వ‌స్థ‌లం రంగారెడ్డి జిల్లా ఇబ్ర‌హీంప‌ట్నం మ‌డ‌లం తులేక‌లాన్ (పెద్ద‌తుండ్ల‌) . డీజీపీగా బాధ్య‌త‌లు స్వీకరించిన అనంత‌రం ఆయ‌న ఈ ఊరుకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున సాద‌ర స్వాగ‌తం ప‌లికారు శివ ధ‌ర్ రెడ్డికి.

Telangana DGP Shivadhar Reddy

ఈ సంద‌ర్బంగా డీజీపీ ప్ర‌తి ఒక్క‌రినీ ఆప్యాయంగా ప‌ల‌క‌రించారు. ఎలా ఉన్నారంటూ వాకబు చేశారు. ఏ స్థాయిలో ఉన్నా, ఎంత‌టి ఉన్న‌త ప‌ద‌విలో ఉన్నా క‌న్న త‌ల్లిదండ్రుల‌ను, పాఠాలు బోధించి ప్ర‌యోజ‌కుల‌ను చేసిన పంతుళ్ల‌ను, మార్గ‌నిర్దేశ‌నం చేసిన వారిని, ప్ర‌త్యేకించి మ‌న‌కంటూ ఓ గుర్తింపు తీసుకు వ‌చ్చేలా చేసిన ఊరును మ‌రిచి పోకూడ‌దంటూ స్ప‌ష్టం చేశారు . ఊరికి సంబంధించి క‌లిసి క‌ట్టుగా ఉండ‌డం త‌న‌ను మ‌రింత ఆనంద‌ప‌ర్చేలా చేసింద‌న్నారు డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి. డీజీపీగా కొలువు తీరాక త‌న‌పై మ‌రింత బాధ్య‌త పెరిగింద‌న్నారు. ఇదే స‌మ‌యంలో ఎవ‌రు ఎలాంటి సాయం కావాల‌న్నా త‌న‌ను సంప్ర‌దించాల‌ని సూచించారు డీజీపీ.

Also Read : Baahubali Re-release Sensational : రీ రిలీజ్ కు సిద్ద‌మైన రాజ‌మౌళి బాహుబ‌లి

Exit mobile version