Telangana : హైదరాబాద్ : టెక్నాలజీ పెరిగిన కొద్దీ ఆన్ లైన్, సైబర్ మోసాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తాజాగా ఇందుకు సంబంధించి ఏకంగా రూ. 95 కోట్ల సైబర్ మోసాన్ని బట్ట బయలు చేసింది తెలంగాణ సైబర్ సెక్యూరిటీ వింగ్. ఈ కేసులో 81 మందిని పట్టు కోవడం విశేషం. ఒక్క తెలంగాణానే (Telangana) కాకుండా ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల అంతటా సమన్వయం చేసుకుని ఈ బిగ్ ఆపరేషన్ నిర్వహించారు తెలంగాణ సైబర్ పోలీసులు. ఈ ఆపరేషన్ లో నిందితులతో పాటు కోట్లాది రూపాయల చీటింగ్ బయట పడింది. ఇదిలా ఉండగా బాధితులకు తిరిగి చెల్లించేందుకు గాను ఆస్తులను జప్తు చేయనున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకుంటారని ఉన్నతాధికారులు వెల్లడించారు.
Telangana Cyber Fraud Case Updates
ఈ మేరకు ఆదివారం కీలక ప్రకటన చేసింది తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) . ప్రధానంగా దేశంలోని అయిదు రాష్ట్రాలలో ఈ మోసానికి సంబంధించి ఆపరేషన్ చేపట్టినట్లు వెల్లడించింది. తమ శాఖా పరంగా బిగ్ క్రైమ్ నెట్ వర్క్ ను ఛేదించడం జరిగిందని తెలిపింది. దేశ వ్యాప్తంగా నమోదైన 754 సైబర్ క్రైమ్ కేసులతో సంబంధం కలిగి ఉన్నారని వీరంతా , వీరు కొల్లగొట్టిన డబ్బులు ఏకంగా రూ. 95 కోట్ల దాకా ఉంటుందని అంచనా అని స్పష్టం చేసింది టీజీఎసీఎస్పీ. కాగా ఈ బిగ్ ఆపరేషన్ కు సంబంధంచి అరెస్ట్ చేసిన వారిలో 17 మంది ఏజెట్లు, ఏడుగురు మహిళలు ఉన్నారు. నిందితుల్లో 58 మంది మోసపూరిత లావాదేవీలకు దోహదం చేసే మ్యూల్ ఖాతాదారులని తమ సెర్చ్ ఆపరేషన్ లో తేలిందని తెలిపింది. ఈ దాడుల్లో 84 ఫోన్లు, 101 సిమ్ కార్డులు, 89 పాస్ బుక్కులు , చెక్ బుక్ లు ఉన్నాయని పేర్కొంది.
Also Read : Nara Lokesh Important Comments : నితీష్ కుమార్ సమర్థతతో బీహార్ రాష్ట్రాభివృద్ది















