Telangana CS : హైదరాబాద్ – ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించు కోలేదని దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ కు సంబంధించి సీఎస్ కె.రామకృష్ణ రావు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి టి.కె.శ్రీదేవిలకు నోటీసులు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. మున్సిపాలిటీల్లో ఉండే భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందించాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Telangana CS Gets Notices from Court
బాధ్యత కలిగిన పదవులలో ఉన్న ఉన్నతాధికారులు ఇలాగేనా వ్యవహరించేది అంటూ మండిపడింది. ఈ పిటిషన్ ను నారాయణపేటకు చెందిన వ్యక్తి ఒకరు పిటిషన్ ను హైకోర్టులో దాఖలు చేసింది. సంబంధిత శాఖలకు మరోసారి వినతి పత్రం ఇవ్వాలని పిటిషనర్ కు సూచించింది. పిటిషనర్ ఇచ్చిన వినతి పత్రంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ జనవరి 27వ తేదీన విచారణ ముగించింది హైకోర్టు.
హైకోర్టు ఆదేశాలను పట్టించు కోకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ప్రభుత్వం పట్ల పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్. దీనిపై విచారణ జరిపి సీఎస్‌కు నోటీసులు జారీ చేస్తూ, విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.
Also Read : Mohammed Shami Case Final : షమీ భార్య, కూతురుకు నెలకు రూ. 4 లక్షలు
















