Telangana Cabinet : హైదరాబాద్ – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పంచాయతీ రాజ్ చట్ట సవరణకు కేబినెట్ (Telangana Cabinet) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ఆమోదం తెలిపింది. దీనిపై త్వరలోనే ఆర్డినెన్స్ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. అందుకే అసెంబ్లీ ప్రొరోగ్ చేసినట్లు సమాచారం. త్వరలోనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనీ నిర్ణయం తీసుకున్నారు.
Telangana Cabinet Approved BC Reservations
అంతేగాకుండా.హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30 నాటికి స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాల్సి ఉంది. సమావేశం అనంతరం ఎన్నికలపైనా కీలక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వర్షాలు, వరదలను ఎదుర్కొనేందుకు, అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడంపైన ఈ కేబినెట్‌లో చర్చ జరిగింది. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, జరిగిన అమలుపైనా చర్చించారు.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బీసీల వాయిస్ వినిపిస్తోంది ఎక్కువగా. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరడంతో రెడ్ల సామాజిక వర్గానికి చెందిన వారికే అత్యధికంగా పదవులు దక్కాయి. దీనిపై బహుజన కులాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టాయి. నిరసనలు వ్యక్తం చేస్తున్నారు బీసీ సంఘాల నేతలు.
Also Read : Popular Host Kapil Sharma : కపిల్ శర్మ కేఫ్ పై ఖలిస్తానీ ఉగ్రవాదుల దాడి















