Tejashwi Yadav Fired on EC : ఈసీ నిర్ల‌క్ష్యంపై తేజ‌స్వి యాద‌వ్ సీరియ‌స్

డ్యూయ‌ల్ ఓట్లు క‌లిగి ఉన్న జాబితాను ఇచ్చా

Hello Telugu - Tejashwi Yadav Fired on EC

Hello Telugu - Tejashwi Yadav Fired on EC

Tejashwi Yadav : బీహార్ – దేశ వ్యాప్తంగా దొంగ ఓట్ల క‌ల‌క‌లం కొన‌సాగుతోంది. ఎంపీ రాహుల్ గాంధీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈ మేర‌కు ప‌క్కా ఆధారాల‌ను స‌మ‌ర్పించారు. ఈ స‌మ‌యంలో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు ఇండియా కూట‌మికి చెందిన ఆర్జేడీ అగ్ర నేత‌, మాజీ డిప్యూటీ సీఎం తేజ‌స్వి యాద‌వ్ (Tejashwi Yadav). త్వ‌ర‌లో రాష్ట్రంలో శాస‌న స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.ఈ సంద‌ర్బంగా రాష్ట్రంలో ఫేక్ ఓట‌ర్ల నమోదు పెరుగుతోంద‌ని, ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలు త‌మ వ‌ద్ద ఉన్నాయ‌ని ఇప్ప‌టికే ఆయ‌న ప్ర‌క‌టించారు. తాజాగా ఆయ‌న చేసిన ఈ ప్ర‌క‌ట‌న రాష్ట్ర రాజ‌కీయాల‌లో తీవ్ర దుమారం చెల‌రేగింది. అధికారంలో ఉన్న నితీష్ కుమార్ ప్ర‌భుత్వం దొంగ ఓట్ల న‌మోదుకు తెర లేపిందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

Tejashwi Yadav Slams EC

ఈ స‌మ‌యంలో ఒక‌రు రెండు ఓట్లు క‌లిగి ఉండ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఇందుకు సంబంధించిన ఆధారాల‌తో కూడిన జాబితాను తాను ఇప్ప‌టికే ఎన్నిక‌ల సంఘానికి పంపించాన‌ని అన్నారు. ఆదివారం తేజ‌స్వి యాద‌వ్ మీడియాతో మాట్లాడారు. అయితే తాను చేసిన ఫిర్యాదుకు ఈసీ స్పందించింద‌ని, ఏవైనా వివ‌రాలు ఉంటే పంపించాల‌ని కోరింద‌న్నారు. ఈ మేర‌కు తాను లిస్టు పంపించాన‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు దీనిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ఆరోపించారు తేజ‌స్వి యాద‌వ్. ఎందుకు స్పందించ లేదో చెప్పాల్సిన బాధ్య‌త ఈసీపై లేదా అని ప్ర‌శ్నించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

Also Read : TTD Garuda Seva Interesting : వైభవంగా శ్రావణ పౌర్ణమి గరుడ సేవ

Exit mobile version