Tejashwi Yadav : బీహార్ – ఆర్జేడీ అగ్ర నేత తేజస్వి యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు ఎన్నికల సంఘం నిర్వాకంపై. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సందర్భంగా బీహార్ ఓటర్ల జాబితాలో ఇతర రాష్ట్రాల వ్యక్తుల పేర్లను చేర్చుతున్నారని మండిపడ్డారు. భారత ఎన్నికల కమిషన్ భారతీయ జనతా పార్టీతో కలిసి బీహార్‌లోని ఓటర్ల జాబితాను తారుమారు చేసేందుకు కుట్ర పన్నారంటూ వాపోయారు. బుధవారం తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) మీడియాతో మాట్లాడారు. బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రెండు ఎలక్టర్ల ఫోటో గుర్తింపు కార్డు నంబర్‌లను జారీ చేస్తోందని రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వి యాదవ్ ఆరోపించారు.
Tejashwi Yadav Slams
ఇదే అంశానికి సంబంధించి బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ సిన్హా గురించి మాట్లాడితే తప్పేముందంటూ ప్రశ్నించారు. ఎన్నికల సంఘం బీజేపీకి సహాయం చేస్తోందని ఆరోపించారు. ఇందులో ప్రధానంగా ప్రతిపక్షాల ఓట్లను తగ్గిస్తోందన్నారు. ముజఫపూర్ మేయర్, బిజెపి నాయకురాలు, నిర్మలా దేవి, ఆమెకు ఒకే విధాన సభలో రెండు ఓటర్ కార్డులు ఉన్నాయని ఇవి ఎలా జారీ చేశారని ఆరపించారు. నిర్మలా దేవికి ఇద్దరు బావమరుదులు ఉన్నారని, వారికి కూడా రెండు చోట్ల కార్డులు ఉన్నాయని, ఇలాంటి ఓటర్లు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సమయంలో బీహార్ ఓటరు జాబితాలో ఇతర రాష్ట్రాల వ్యక్తుల పేర్లను చేర్చుతున్నారని మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు గుజరాత్ ప్రజలు బీహార్ ఓటర్లుగా మారుతున్నారని దీనికి కారణం ఎన్నికల సంఘం, బీజేపీలేనని మండిపడ్డారు.
Also Read : Supreme Court Shocking – Sushil Kumar : రెజ్లర్ సుశీల్ కుమార్ కు సుప్రీం షాక్
















