Tejashwi Yadav : బీహార్ : బీహార్ లో ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయా పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ మరోసారి పవర్ లోకి రావాలని అనుకుంటోంది. ఇదే సమయంలో ఇండియా కూటమి సైతం పెద్ద ఎత్తున పోరాడుతోంది. ఇంకో వైపు ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ జన్ సురక్ష్ పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు. ఆయన ముందస్తుగా తొలి జాబితాను ఖరారు చేశారు. ఈ తరుణంలో తాజాగా రాష్ట్రీయ జనతా దళ్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) సంచలన ప్రకటన చేశారు. ఇండియా కూటమి గనుక పవర్ లోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆయన చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఇదే ఎన్నికల నినాదంగా మారనుంది.
Tejashwi Yadav Comments
ప్రతి కుటుంబంలో ఒకరికి వయస్సు, కులం లేదా సమాజంతో సంబంధం లేకుండా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని పేర్కొన్నారు . పాట్నాలో మీడియాతో మాట్లాడారు తేజస్వి యాదవ్. ఎన్నికల తేదీ ప్రకటించిన తర్వాత తాము దీనిని ప్రకటించామన్నారు. ఇది తప్పకుండా సాధ్యమవుతుందన్నారు. బీహార్‌లో ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించడానికి 20 రోజుల్లోపు తాము ఒక చట్టాన్ని తీసుకు వస్తామన్నారు. గత 20 ఏళ్లలో నితీష్-ఎన్డీఏ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైందని ఆరోపించారు. తాను 17 నెలలు అధికారంలో ఉన్నప్పుడు 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని నా 2020 ఎన్నికల హామీని నెరవేర్చానని చెప్పారు. కొత్త బీహార్‌ను నిర్మించడానికి ఐదు సంవత్సరాలు నిజం, నిజాయితీ, పరిపూర్ణతతో పని చేస్తానని స్పష్టం చేశారు.
Also Read : Modi-Starmer Important Meet : మోదీ–స్టార్మర్ భేటీ: కీలక ఒప్పందాలకు నాంది

















