సాంకేతిక లోపం బ్యాంకింగ్ సేవ‌ల‌కు అంత‌రాయం

ఇందులో జేపీ మోర్గాన్ చేజ్ లో కూడా ఇబ్బంది

hellotelugu-JPMorgaanChase

వాషింగ్ట‌న్ : సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా అమెరికా అంతటా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగింది. దీనివల్ల వేలాది మంది వినియోగదారులు తమ ఖాతాలను యాక్సెస్ చేయడంలో , లావాదేవీలు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సాంకేతిక లోపం వల్ల అమెరికాలోని అతిపెద్ద బ్యాంకు అయిన జేపీ మోర్గాన్ చేజ్ లో సేవలు నిలిచి పోయాయి. ఈ సమస్య కేవలం ఈ కంపెనీకే పరిమితం కాకుండా ఇతర ఆర్థిక సంస్థల వినియోగదారుల లావాదేవీలపై కూడా ప్రభావం చూపింది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థలో వైఫల్యం కారణంగా అమెరికాలో దాదాపు 10,000 విమాన ప్రయాణాలు రద్దయిన కొద్ది రోజులకే ఈ బ్యాంకింగ్ అంతరాయం చోటు చేసుకోవడం గమనార్హం. ఇటీవల కాలంలో ప్రధాన సేవలకు సంబంధించి వరుసగా జరుగుతున్న సాంకేతిక అంతరాయాల్లో ఇది మరొకటిగా నిలిచింది. తమ అంతర్గత వ్యవస్థల్లోని ఒక సాఫ్ట్‌వేర్ లోపం వల్లే ఈ అంతరాయం ఏర్పడిందని జేపీ మోర్గాన్ చేజ్ ధృవీకరించింది.

ఈ ఘటన సమయంలో వెల్స్ ఫార్గో, బ్యాంక్ ఆఫ్ అమెరికా , యుఎస్ బ్యాంక్ , ట్రూఇస్ట్ త‌దిత‌ర బ్యాంకుల వినియోగదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. జేపీ మోర్గాన్ కు చెందిన కన్స్యూమర్ బ్యాంకింగ్ విభాగం చేజ్ అమెరికా అంతటా సుమారు 5,000 శాఖల ద్వారా 86 మిలియన్లకు పైగా వినియోగదారులకు , 7.4 మిలియన్ల చిన్న వ్యాపార సంస్థలకు సేవలను అందిస్తోంది. దీనిపై స్పందించింది జేపీ మోర్గాన్. తమ ఆన్-ప్రిమిస్ హార్డ్‌వేర్ వ్యవస్థల్లో తలెత్తిన సాఫ్ట్‌వేర్ లోపం వల్ల సేవలకు అంతరాయం కలిగిందని వివరించింది. ఇది సైబర్ దాడి వల్ల జరిగిన ఘటన కాదని కూడా బ్యాంకు స్పష్టం చేసింది. ఆన్-ప్రిమిస్ హార్డ్‌వేర్ వ్యవస్థలకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ లోపం వల్ల తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. దీనికి సైబర్ దాడితో ఎటువంటి సంబంధం లేదు అని బ్యాంకు పేర్కొంది.

Exit mobile version