ఢిల్లీ : కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన కీలకమైన లీగ్ మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఎలెవన్ జట్టు 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 155 రన్స్ చేసింది. దీంతో మైదానంలోకి దిగిన చెన్నై జట్టు నిర్ణీత 17.3 ఓవర్లలోనే 156 రన్స్ పూర్తి చేసింది. సంజు శాంసన్ 52 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు 6 సిక్సర్లతో 87 రన్స్ చేశాడు. ఆట చివరి వరకు ఉన్నాడు. అజేయంగా ఉన్నాడు. తనతో పాటు యంగ్ క్రికెటర్ కార్తీక్ శర్మ 47 రన్స్ చేసి గెలుపు లో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ గెలుపొందిన అనంతరం ప్లేయర్ ఆఫ్ ది అవార్డు పొందిన సంజు శాంసన్ మీడియాతో మాట్లాడాడు. తనకు వ్యక్తిగత స్కోర్ లు, రికార్డులు, సెంచరీల కంటే జట్టు విజయం సాధించడమే ముఖ్యమని స్పష్టం చేశాడు.
నేను పరుగులు చేసిన తర్వాత జట్టు గెలిచినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంద. ఎందుకంటే నాకు ఎప్పుడూ జట్టుకే మొదటి ప్రాధాన్యత. ఈరోజు ఇన్నింగ్స్‌తో నేను చాలా సంతోషంగా ఉన్నాను, జట్టుగా మేమంతా చాలా మంచి క్రికెట్ ఆడామన్నాడు. బౌలర్లు ప్రతి మ్యాచ్‌లోనూ అద్భుతమైన ప్రదర్శనలు ఇస్తున్నారు. అయితే, ఈరోజు వికెట్ కొంచెం నెమ్మదిగా ఉంది, కాబట్టి నేను మొదట్లో పరిస్థితులను అర్థం చేసుకోవడానికి కొంత సమయం తీసుకున్నా. ఆ తర్వాత పరిస్థితికి అనుగుణంగా బ్యాటింగ్ చేశాను. నాతో పాటు కార్తీక్ శర్మ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇదే విధంగా తాము గెలుస్తూ, టాప్ ఫోర్‌లో నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపాడు.
