ముంబై : ముంబై వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. ఇండియా, ఇంగ్లండ్ జట్లు నువ్వా నేనా అన్న రీతిలో ఆడాయి. ఇరు జట్లు కలిసి భారీ స్కోర్ ను నమోదు చేశాయి. భారత్ రికార్డు స్కోర్ చేసినా పోరాడి ఓడింది ఇంగ్లండ్. టాస్ ఓడి మైదానంలోకి దిగిన భారత్ ఆరంభం నుంచే దాడి చేయడం మొదలు పెట్టింది. అభిషేక్ శర్మ త్వరగా అవుట్ అయినా ఎక్కడా తల వంచలేదు. కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ మరోసారి రెచ్చి పోయాడు. కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్ల భరతం పట్టాడు. తను ఈ ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 8 ఫోర్లు 7 సిక్సులతో 89 రన్స్ చేశాడు. తనకు తోడుగా ఇషాన్ కిషన్ 38 రన్స్ చేయగా, శివమ్ దూబే 44 పరుగులతో ఆకట్టుకున్నాడు. సూర్య కుమార్ యాదవ్ 11 రన్స్ చేస్తే హార్దిక్ పాండ్యా 26 రన్స్ చేయగా, తిలక్ వర్మ 27 పరుగులు చేశాడు.
అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్ చివరి వరకు పోరాడింది. భారత్ కు గట్టి పోటీ ఇచ్చింది. ఒకానొక దశలో ఇండియా ఆశలపై నీళ్లు చల్లేలా ఆడింది. కానీ ఇండియాకు చెందిన బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ , హార్దిక్ పాండ్యాలు ఇంగ్లండ్ ను కట్టడి చేశారు. 16వ, 18వ ఓవర్ వేసిన ఈ ఓవర్లు ఇండియాను గెలిపించేలా చేశాయి. మరో వైపు అక్షర్ పటేల్ తీసుకున్న క్యాచ్ లు కూడా కీలకంగా వ్యవహరించాయి. దీంతో భారత జట్టు 7 పరుగుల తేడాతో ఓడించింది ఇంగ్లండ్ ను. అహ్మదాబాద్ వేదికగా జరిగే వరల్డ్ కప్ ఫైనల్ లో న్యూజిలాండ్ జట్టుతో తలపడనుంది. మొత్తంగా ఇది భారత జట్టు సమిష్టి విజయం అని చెప్పక తప్పదు.


















