TCS : బెంగళూరు – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బకు దిగ్గజ కంపెనీలు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. మొన్నటికి మొన్న గూగుల్ , మైక్రోసాఫ్ట్ భారీ ఎత్తున జాబ్స్ తీసి వేస్తున్నట్లు ప్రకటించాయి. మరో దిగ్గజ సంస్థ ఇంటెల్ ఏకంగా 25,000 మందిని సాగనంపుతున్నట్లు షాకిచ్చింది. తాజాగా భారతీయ దిగ్గజ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కె. కృతి వాసన్ చావు కబురు చల్లగా చెప్పారు. తమ సంస్థలో 12,000 ఉద్యోగాలను ఈ ఆర్థిక సంవత్సరంలో తొలగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టు ప్రారంభాలలో జాప్యం చోటు చేసుకుందని అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పడం లేదన్నారు.
TCS Shocking
టీసీఎస్ (TCS) లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కాడ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. మొదటి త్రైమాసికం చివరిలో ఉద్యోగుల సంఖ్య 6,13,069 కు చేరుకుందని వెల్లడించారు. ప్రధానంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రాజెక్టులు ఆశించిన మేర రాలేదని అందుకే కనీసం 2 శాతం తగ్గించాలని ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ చర్య ప్రధానంగా మధ్య, సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయిలలోని ఉద్యోగులపై ప్రభావం చూపే అవకాశం ఉందని సూచన ప్రాయంగా అంగీకరించారు. క్యూ 1 చివరలో 13.8 శాతంగా ఉందన్నారు.
అయితే ఇంకో కీలక వ్యాఖ్య చేశారు సంస్థ వైస్ ప్రెసిడెంట్. ఈ కోతలకు ప్రధాన కారణం ప్రాజెక్టుల జాప్యంతో పాటు ఏఐ కూడా ఒకటి అని పేర్కొన్నారు. ఇటీవల ఏఐ టూల్ కారణంగా పెద్ద ఎత్తున సంస్థలు ఉద్యోగులపై వేటు వస్తుండడం గమనార్హం.
Also Read : India Shocking England : ఇంగ్లండ్ ఆశలపై నీళ్లు చల్లిన టీమిండియా



















