Hero Nithin Reddy – Tammudu : నెట్ ఫ్లిక్స్ లో నితిన్ రెడ్డి త‌మ్ముడు స్ట్రీమింగ్

ఆగస్టు 1న రానుంద‌ని ప్ర‌క‌టించిన ఓటీటీ సంస్థ

hellotelugu-tammuduott

Tammudu : ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన చిత్రం త‌మ్ముడు చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విష‌యాన్ని స‌ద‌రు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్ర‌క‌టించింది. న‌టుడు నితిన్ రెడ్డి అభిమానులు ఎంత‌గానో ఎదురు చూస్తున్న చిత్రం త‌మ్ముడు (Tammudu) ఆగ‌స్టు 1వ తేదీన స్ట్రీమింగ్ అవుతుంద‌ని, అంతా చూసేందుకు రెడీగా ఉండాల‌ని కోరింది. సినిమా ప‌రంగా మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. నితిన్ కు ఇది ఈ ఏడాది రెండో సినిమా కావ‌డం విశేషం. శ్రీ‌లీల‌తో క‌లిసి న‌టించిన రాబిన్ హుడ్ మూవీ దొబ్బింది. బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. క‌థ‌ను తెర‌కెక్కించ‌డంలో ద‌ర్శ‌కుడు పూర్తిగా ఫెయిల్ కావ‌డంతో నితిన్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇందులో ప్ర‌ముఖ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ కీ రోల్ పోషించినా సినిమా గ‌ట్టెక్క లేక పోయంది.

Nithin Reddy Tammudu Movie OTT Updates

ఇక సినిమా ప‌రంగా చూస్తే థియేటర్ ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడానికి ఇబ్బంది పడిన ఈ భావోద్వేగ తోబుట్టువుల చిత్రం తెలుగు, తమిళం, కన్నడ‌, మలయాళంలో నెట్‌ఫ్లిక్స్‌లో పాన్-సౌత్ OTT విడుదలకు సిద్ధంగా ఉంది. శక్తివంతమైన తారాగణం, అనుభవజ్ఞుడైన దర్శకుడు వేణు శ్రీరామ్, బి. అజనీష్ లోక్‌నాథ్ రూపొందించిన ఆత్మీయ సౌండ్‌ట్రాక్ ఉన్న‌ప్ప‌టికీ ఆక‌ట్టుకోలేక పోయింది. కాగా ఈ చిత్రం థియేటర్లలో మ్యాజిక్‌ను సృష్టించడంలో విఫలమైంది. కాగా థియేటర్ల‌లో ఆశించిన మేర స్పంద‌న లేక పోయినా ఓటీటీలో దుమ్ము రేపుతుంద‌ని నిర్మాత దిల్ రాజు ఆశతో ఉన్నారు. ఆయ‌నకు సంబంధించిన మూడు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వచ్చాయి. వాటిలో రెండు సినిమాలు అట్ట‌ర్ ప్లాప్ కాగా సంక్రాంతికి వ‌స్తున్నాం మాత్రం సూప‌ర్ స‌క్సెస్ అయ్యింది. రూ. 300 కోట్లు సాధించింది.

Also Read : Big Boss 9 Interesting Updates : సెప్టెంబ‌ర్ లో రానున్న బిగ్ బాస్ -9 సీజ‌న్

Exit mobile version