హైదరాబాద్ : శివ కందుకూరి ఎంతో కష్టపడి తీసిన ‘టాల్కం పౌడర్’ నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘పెళ్లి చూపులు’, ‘మెంటల్ మదిలో’, ‘సి/ఓ కంచరపాలెం’ వంటి కంటెంట్-ఆధారిత చిత్రాలకు మద్దతు ఇచ్చిన జాతీయ అవార్డు గ్రహీత, నిర్మాత రాజ్ కందుకూరి ఇప్పుడు ‘టాల్కం పౌడర్’ అనే ఆసక్తికరమైన చిత్రంతో వస్తున్నారు. సాయి నాథ్ పొన్న రచన , దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్రైమ్-డ్రామెడీ చిత్రంలో శివ కందుకూరి, దృషిక చందర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచాన్ని, కథానాయకుడు ‘కుంఠ్య’ను పరిచయం చేస్తూ చిత్ర బృందం ‘ది ఫస్ట్ స్ప్రింకిల్స పేరుతో ఒక గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఒక చిన్న పొరపాటు కారణంగా ఊహించని పరిస్థితుల్లో చిక్కుకున్న డ్రగ్ పెడ్లర్ (మాదకద్రవ్యాల విక్రేత) పాత్రలో కుంఠ్య కనిపిస్తాడు.
పోలీసులు, గ్యాంగ్‌స్టర్లు అతన్ని వేటాడుతుండగా అసలు ఆ పొరపాటు ఏమిటి? అతను ఆ పరిస్థితి నుండి ఎలా బయట పడతాడు? అనే ఆసక్తిని ఈ గ్లింప్స్ రేకెత్తిస్తోంది. క్రైమ్-కామెడీ , డ్రామా అంశాలతో కూడిన ఈ చిత్రం ఊహించని మలుపులు , విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేయనుంది. శివ కందుకూరి తన చురుకైన స్క్రీన్ ప్రజెన్స్‌తో ఆకట్టుకోగా, వెంకటేష్ మహా, జీవన్ కుమార్ వంటి ఇతర ముఖ్యమైన పాత్రలను కూడా ఇందులో పరిచయం చేశారు. సాంకేతిక విభాగం విషయానికొస్తే జి.వి. అజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా, ఓషో వి సంగీతం సమకూర్చారు . సూర్య పొన్నపల్లి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ధర్మ పథ క్రియేషన్స్ బ్యానర్‌పై రాజ్ కందుకూరి నిర్మిస్తున్న ‘టాల్కం పౌడర్’ చిత్రం పై అంచనాలు పెంచేలా చేసింది.



















