KTR : హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్కువగా ప్రాచుర్యం పొందింది టి హబ్. దీనిని ఆనాడు ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ (KTR) ప్రోద్భలంతో, పట్టుదలతో ఏర్పాటైంది. ఇందు కోసం ఆయన చాలా శ్రమించారు. రాష్ట్రంలో వివిధ రంగాలలో పెద్ద ఎత్తున ప్రతిభా, నైపుణ్యాలు దాగి ఉన్న వారు ఎందరో ఉన్నారని, వారందరికీ ఒక వేదిక ఉండాలని కోరుకున్నారు. ఆ కలలకు ప్రతిరూపమే నేటి టి హబ్. ఇక్కడ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన దీని వద్దకు దేశ వ్యాప్తంగా పేరు పొందిన వారంతా వచ్చారు. ముఖ్యంగా భారత దేశం గర్వించ దగిన వ్యాపారవేత్త, దివంగత రతన్ టాటా, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, దిగ్గజ సంగీత స్వరకర్త అల్లా రఖా రెహమాన్ , క్రికెట్ మాస్టర్ సచిన్ రమేష్ టెండూల్కర్, ఇలా చెప్పుకుంటూ దిగ్గజ ప్రముఖలంతా ఇక్కడికి విచ్చేసిన వారే. వారంతా తమ అనుభవాలను పంచుకున్నారు.
KTR Key Comments on T-Hub
కలలు, ఆలోచనలకు రెక్కలు తొడిగిన వారికి మార్గదర్శకంగా నిలిచారని ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు మాజీ మంత్రి కేటీఆర్. భారతదేశ స్టార్టప్ వ్యవస్థలో తెలంగాణ అగ్రగామిగా ఎదగడానికి పునాది వేసిన ఆవిర్భావ దినోత్సవం ఈరోజు నవంబర్ 5 అని గుర్తు చేశారు. కేసీఆర్ దార్శనిక నాయకత్వంలో, సమగ్ర ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థను నిర్మించినట్లు తెలిపారు. హైదరాబాద్‌ను భారతదేశ స్టార్టప్ రాజధానిగా స్థాపించడం జరిగిందన్నారు కేటీఆర్ . టి-హబ్ కేవలం మొదటి అడుగు, తరువాత వి-హబ్, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, టి-వర్క్స్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్), ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (రిచ్) లను ఏర్పాటు చేశామన్నారు. రతన్ టాటా కలలను నిజం చేసిందన్నారు.
Also Read : TTD Interesting Update : తిరుచానూరు బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
















