Swiggy : ఆన్‌లైన్‌లో ఆహారం ఆర్డర్ చేసే వారికి మరోసారి ఖర్చులు పెరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం డెలివరీ ఛార్జీలపై 18 శాతం జీఎస్టీ విధించనుంది. ఈ కొత్త నిబంధన సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానుంది. దీంతో స్విగ్గీ , జొమాటో (Zomato) వంటి ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఆహారం తెప్పించుకోవడం మరింత ఖరీదవుతుంది.
Swiggy-Zomato Shocking
ఇప్పటికే పండుగల సీజన్‌లో డెలివరీ ఛార్జీలు పెరిగాయి. ఇప్పుడు అదనంగా 18 శాతం జీఎస్టీ అమలులోకి రానుండటంతో వినియోగదారులపై భారం మరింతగా పడనుంది. ప్రస్తుతం ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సేవలపై ఐదు శాతం పన్ను అమలులో ఉంది. అయితే సెప్టెంబర్ 22 నుంచి అది 18 శాతానికి పెరుగుతోంది.
ఈ పన్ను మొత్తాన్ని వినియోగదారుల నుంచే వసూలు చేయనున్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన ప్రాంతాల్లో స్విగ్గీ ప్లాట్‌ఫామ్ ఫీజుగా రూ.15 వసూలు చేస్తోంది. జొమాటో కూడా ప్లాట్‌ఫామ్ ఫీజును రూ.12.50 (జీఎస్టీ మినహాయించి)కి పెంచింది. కొత్త నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 22 తర్వాత ఈ ఫీజులు ఐదు నుండి ఆరు రూపాయలు అదనంగా పెరగవచ్చని అంచనా.
Also Read : Stock Market Growth : స్టాక్ మార్కెట్ లో నేడు భారీ లాభాలను చుసిన సూచీలు



















