ముంబై : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెలెక్షన్ కమిటీ శనివారం సంచలన ప్రకటన చేసింది. ఐర్లాండ్ తో జరిగే టి20 సీరీస్ కు ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కు సారథ్యం వహిస్తున్న శ్రేయస్ అయ్యర్ కు సారథ్య బాధ్యతలు కట్టబెట్టింది. అంతే కాకుండా వరల్డ్ కప్ రెండు సార్లు ఇండియాకు తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించిన ముంబైకి చెందిన స్టార్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ ను పూర్తిగా పక్కన పెట్టేసింది. కెప్టెన్సీతో పాటు ఏకంగా జట్టు నుంచి స్థానం కోల్పోయాడు. దీంతో సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ తో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్.
తను అద్భుతమైన నాయకుడిగా గుర్తింపు పొందాడు. అంతే కాదు బ్యాటర్ కూడా. ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించలేదు. విచిత్రం ఏమిటంటే బీహార్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్య వంశీకి చోటు దక్కగా హైదరాబద్ కు చెందిన తిలక్ వర్మకు ప్రమోషన్ లభించింది. తనకు వైస్ కెప్టెన్సీ ఛాన్స్ లభించింది. ఇది పక్కన పెడితే ఐపీఎల్ 19వ సీజన్ లో సూపర్ షో చేసిన పలువురు ఆటగాళ్లకు అవకాశం దక్కింది. వీరిలో ఇషాన్ కిషన్ ఉండగా మరొకరు ప్రిన్స్ యాదవ్ ను బౌలింగ్ విభాగంలో తీసుకున్నట్లు ప్రకటించాడు హెడ్ కోచ్ గౌతం గంభీర్. ఇక సూర్య కుమార్ యాదవ్ కు మరో పేరు కూడా ఉంది. మిస్టర్ 360 అని. భిన్నమైన షాట్స్ ఆడడంలో తనకు తనే సాటి. 1990లో పుట్టాడు.. 2010లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 2021లో ఇంగ్లాండ్‌పై టి20 ఫార్మాట్ లో అరంగేట్రం చేశాడు. వన్డేలో శ్రీలంకపై ఆడాడు. టి20 ఫార్మాట్ లో నాలుగు సెంచరీలు చేసిన క్రికెటర్ గా గుర్తింపు పొందాడు. చివరకు జట్టులో ప్లేస్ కోల్పోయాడు.

















