విజయనగరం సబ్ జైలు ఆక‌స్మిక త‌నిఖీ

జిల్లా జైలులో ఖైదీల‌తో మంత్రి ముచ్చ‌ట

hellotelugu-AnithaVangalapudi

విజ‌య‌న‌గ‌రం జిల్లా : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడి సోమ‌వారం ఆక‌స్మిక ప‌ర్య‌ట‌న చేశారు. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ప‌ర్య‌టించారు. జిల్లా జైలును ఆక‌స్మికంగా త‌నిఖీ చేప‌ట్టారు. సబ్ జైల్లో రికార్డులు పరిశీలించారు. ఈ సంద‌ర్బంగా జైల్లో ఖైదీలతో మాట్లాడారు హోం మంత్రి. వంటగదిని పరిశీలించి, భోజనం ఏ విధంగా ఉంటుందో ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. అలాగే విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ కూడా ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఇదే క్ర‌మంలో పోలీసుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. అక్క‌డే ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప‌నితీరు గురించి ఆరా తీశారు. శ‌క్తి టీమ్స్ ఏవిధంగా ప‌ని చేస్తున్నాయ‌ని ప్ర‌శ్నించారు. ఎస్పీ స‌మాధానం ఇచ్చారు మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌కు.

అనంత‌రం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించి, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని పోలీసులను ఆదేశించారు. ఇదిలా ఉండ‌గా సబ్ జైలు , రూరల్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీల్లో మంత్రి వెంట ఉన్నారు ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. అక్క‌డి నుంచి నేరుగా క‌లెక్ట‌రేట్ కు వెళ్లారు. ప్ర‌స్తుతం రాష్ట్ర హోం శాఖ మంత్రి ఇంచార్జి మంత్రిగా విజ‌య‌న‌గ‌రం జిల్లాకు ఉన్నారు. అనిత ఆద్వర్యంలో జిల్లా కలెక్టరేట్ లో సర్వసభ్య సమావేశం, బడ్జెట్ ఔట్రీచ్ ప్రోగ్రాం చేప‌ట్టారు. ఈ కీల‌క స‌మావేశానికి హాజ‌రయ్యారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. కలెక్టర్ రామ సుందర్ రెడ్డి, ఎస్పీ దామోదర్, ఎమ్మెల్యేలు కళా వెంకటరావు, కోళ్ల లలిత కుమారి, అదితి గజపతిరాజు, బేబీ నాయన, లోకం మాధవి, ఎమ్మెల్సీలు సురేష్ బాబు, గాదె శ్రీనివాసులు నాయుడు, గ్రీష్మ, మార్కుఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్ పర్సన్ పాలవలస యశస్వి, జిల్లా డిసిసిబి చైర్మన్ కిమిడి నాగార్జున .

Exit mobile version