Supreme Court: ఢిల్లీ – భార్యా భర్తల విడాకుల కేసుకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ (Justice Gavai). అన్ని అర్హతలు ఉండి సంపాదించే సామర్థ్యం, సత్తా , శక్తి కలిగి ఉన్నప్పుడు ఇంకొకరి సంపాదన గురించి ఎందుకు ఆలోచించాలని ప్రశ్నించారు. భర్త నుండి విడాకుల భరణం కింద బీఎండబ్ల్యూ కారు, ముంబైలో ఇల్లు, 12 కోట్ల నగదు ఇప్పించాలని మహిళ పిటిషన్ ఆదేశాలు జారీ చేయడంపై తీవ్రంగా స్పందించారు.
Supreme Court of India Comments on Divorce Case
విడాకులు కావాలని కోరిన మహిళను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జస్టిస్ బీఆర్ గవాయ్. మీరు ఎంబీఏ చేశారు, మంచి ఉద్యోగం చేసుకోండి అంటూ సూచించారు. పెళ్లైన 18 నెలలకే విడాకులు కోరుతూ, తన భర్త నుండి భారీ మొత్తంలో భరణం కావాలని సుప్రీంకోర్టును ఆశ్రయించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ దావాపై విచారణ చేపట్టారు. పెళ్లైన 18 నెలలకు దాదాపు నెలకు ఒక కోటి రూపాయల చొప్పున భరణం అడగడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ .
మీరు ఎంబీఏ చదివారు, ఐటీ ప్రొఫెషనల్, సంపాదించే సామర్థ్యం ఉంది, చక్కని ఉద్యోగం చేసుకోండంటూ హితవు పలికింది గవాయ్ తో కూడిన ధర్మాసనం. అయితే తన భర్త ధనవంతుడని, తాను మానసిక ఇబ్బందులతో బాధ పడుతున్నానని అతనే విడాకులు ఇవ్వాలని నిర్ణయించు కున్నాడని, వాపోయింది బాధితురాలు. తాను మానసిక ఇబ్బందులు ఉన్నట్టు కనిపిస్తున్నానా అధ్యక్షా అంటూ బీఆర్ గవాయ్‌ని ప్రశ్నించింది సదరు మహిళ. దీంతో ముంబైలో ఒక ఇల్లు లేదంటే రూ.4 కోట్లు భరణం తీసుకోవాలని ఆమెకు సూచించారు జస్టిస్ గవాయ్.
Also Read : Pawan Kalyan Interesting Comments : నాగబాబు మంత్రి పదవిపై చర్చించ లేదు
















