Supreme Court : ఢిల్లీ : సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సోమవారం ఖలీద్, ఇమామ్‌ల బెయిల్‌పై ఢిల్లీ పోలీసుల మరింత సమయం కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది . బెయిల్ విషయాలలో కౌంటర్ దాఖలు చేసే ప్రశ్నే లేదు అని సుప్రీంకోర్టు (Supreme Court) పేర్కొంది . ఉపా కేసు విచారణ అక్టోబర్ 31క వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. 2020 ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన ఉపా కేసులో కార్యకర్తలు ఉమర్ ఖలీద్, షల్జీల్ ఇమామ్ , ఇతరులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లకు స్పందించేందుకు మరో రెండు వారాల సమయం కావాలని ఢిల్లీ పోలీసులు అభ్యర్థించారు. దీనికి ధర్మాసనం ఒప్పుకోలేదు. ఇంకా ఎన్ని రోజులు కావాలంటూ ప్రశ్నించింది.
Supreme Court Shocking Delhi Police
ఇదిలా ఉండగా ఫిబ్రవరి 2020లో ఢిల్లీలో జరిగిన అల్లర్ల వెనుక కుట్ర జరిగిందని, దీని వెనుక ఖలీద్, ఇమామ్ లతో పాటు మరికొందరు ఉన్నారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉపా కింద కేసు నమోదు చేశారు. ఇది పూర్తిగా రాజ ద్రోహం, దేశ ద్రోహం కిందకు వస్తుంది ఈ చట్టం. దీనిని సవాల్ చేస్తూ తాము ఎక్కడా ఎలాంటి వ్యతిరేక చర్యలకు పాల్పడలేదని, కేవలం తమ హక్కుల కోసం మాత్రమే పోరాటం చేశామని బాధితులు తెలిపారు. ఈ విషయాన్ని న్యాయవాది కోర్టుకు వెళ్లడించారు. తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంకెన్ని రోజులు కావాలంటూ ప్రశ్నించింది. ఢిల్లీ పోలీసుల తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ రాజు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి సమయం కోరారు. నిజం చెప్పాలంటే, బెయిల్ విషయాలలో కౌంటర్ దాఖలు చేసే ప్రశ్నే లేదంటూ ధర్మాసనం స్పష్టం చేసింది.
Also Read : Popular Cricketer Shreyas Iyer : ఐసీయూలో క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్
