Supreme Court : ఢిల్లీ : తమిళనాడులోని కరూర్ లో టీవీకే విజయ్ చేపట్టిన ప్రచార ర్యాలీ సందర్బంగా చోటు చేసుకున్న ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై తమిళనాడు హైకోర్టు సిట్ ఏర్పాటు చేయాలని డీఎంకే సర్కార్ ను ఆదేశించింది. ఇదిలా ఉండగా దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణకు ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ సందర్బంగా సోమవారం విచారణ చేపట్టింది ధర్మాసనం. సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు టీవీకే విజయ్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశించింది. సీబీఐ దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
Supreme Court Key Orders
ఇదిలా ఉండగా ఈ కరూర్ ఘటన గత సెప్టెంబర్ నెల 27వ తేదీన చోటు చేసుకుంది. ఇదే సమయంలో మద్రాస్ హైకోర్టును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది. కరూర్ తొక్కిసలాటపై దాఖలైన పిటిషన్లను మద్రాస్ హైకోర్టులోని రెండు బెంచ్‌లు ఎలా విచారించాయని కోర్టు గతంలో ప్రశ్నించింది. కాగా ఈ సంఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు కోసం మద్రాస్ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ తమిళ నటుడు విజయ్ నేతృత్వంలోని పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దర్యాప్తును పర్యవేక్షిస్తుందని న్యాయమూర్తులు జెకె మహేశ్వరి, ఎన్వి అంజరియాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
అంతే కాదు తమిళనాడు కేడర్‌కు చెందిన కానీ రాష్ట్ర స్థానికులు కాని ఇద్దరు భారత పోలీసు అధికారులు ప్యానెల్‌లో భాగమవుతారని కూడా ఇది జోడించింది. ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (IGP) స్థాయి కంటే తక్కువ లేని అధికారులను జస్టిస్ రస్తోగి ఎంపిక చేస్తారని స్పష్టం చేసింది ధర్మాసనం.
Also Read : BRS Shocking Comments : జూబ్లీహిల్స్ లో ఒకే ఇంట్లో 40 మందికి పైగా ఓటర్లు

















